|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం

Published: 10-12-2025, 1:48 AM
Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
  • వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది.
  • సినిమాకు `ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెం: 47` అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
  • హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది.
  • వెంకటేష్‌ ఫ్యామిలీ మ్యాన్ లుక్‌లో క్లాస్‌గా కనిపించి ఆకట్టుకుంటున్నారు.

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం హౌజ్ నెం: 47’ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా టైటిల్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్ లుక్‌లో కనిపించనున్నారు.

వెంకటేష్‌-త్రివిక్రమ్‌ కాంబోలో తొలి సినిమా

విక్టరీ వెంకటేష్‌ ఈ ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టారు. అది ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో చాలా సెలక్టీవ్ గా వెళ్తోన్న వెంకటేష్‌ ఇప్పుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు)  నిర్మిస్తున్న ఈ చిత్రం ఆ మధ్య ఓపెనింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభించుకుంది. బుధవారం నుంచి షూటింగ్‌ స్టార్ట్ అయినట్టు టీమ్‌ అధికారికంగా వెల్లడించింది.

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి చిత్రమిది. వెంకటేష్‌ సినిమాలకు త్రివిక్రమ్‌ రైటర్‌గా పనిచేశారు. కానీ త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వెంకీ సినిమా చేయలేదు. చాలా ఏళ్లుగా ఈ ఇద్దరు కలిసి పనిచేయాలని భావించారు. ఓ సారి అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఆ తర్వాత ఆగిపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు పట్టాలెక్కింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ని ప్రకటించారు. దీనికి `ఆదర్శకుటుంబం` అనే పేరుని ఖరారు చేశారు. అయితే ఇందులో వెంకటేష్‌ ఉండే హౌజ్‌ నెంబర్‌ని కూడా ప్రకటించడం విశేషం. `ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెం: 47`గా దీన్ని ఖరారు చేశారు. `ఆదర్శ కుటుంబ` మూవీలో వెంకటేష్‌ హౌజ్‌ నెం: 47 లో ఉంటాడని తెలుస్తోంది.

`ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెం: 47` టైటిల్ ఖరారు

వెంకటేష్‌ ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్‌. అదే సమయంలో త్రివిక్రమ్‌ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా డీల్ చేశారు. `అల వైకుంఠపురములో` చిత్రానికిది నిదర్శనం. ఇది ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్లాన్‌ని వర్కౌట్‌ చేస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్. వెంకటేష్‌ మూవీకి కూడా మంచి ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే టైటిల్‌ పెట్టారు. టైటిల్ లోగోని గమనిస్తే.. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రంలో ఉత్కంఠ రేకెత్తించే అంశాలు కూడా ఉంటాయని అర్థమవుతోంది.

ఫస్ట్ లుక్, షూటింగ్ వివరాలు

`ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47` ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్ లుక్‌లో క్లాస్ గా కనిపిస్తున్నారు. హృదయాన్ని తాకే భావోద్వేగాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రాబోతోందనే సంకేతాన్ని ఫస్ట్ లుక్ ఇస్తోంది. ఈరోజు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ మొదలైంది. వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచి చిత్ర పరిశ్రమతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. పైగా త్రివిక్రమ్ శైలి భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలను మేళవిస్తూ తెరకెక్కించే చిత్రంలో వెంకటేష్ నటిస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. వెంకటేష్ తో కలిసి, ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని త్రివిక్రమ్ అందిస్తారనే అంచనాలు నెలకొన్నాయి.

వెంకటేష్‌ ఫ్యామిలీ ఇమేజ్‌, త్రివిక్రమ్‌ డైరెక్షన్ శైలి కలగలిపి ఈ `ఆదర్శ కుటుంబం` చిత్రం అంచనాలను పెంచుతోంది. హృదయాన్ని తాకే భావోద్వేగాలతో, వినోదభరితంగా సాగే ఈ కుటుంబ కథా చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.