|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aamir Khan: రోడ్డుపై అమిర్ ఖాన్ ప్రియురాలు.. ఇక్కడ కూడా వదలరా?

Published: 25-09-2025, 7:43 AM
Aamir Khan: రోడ్డుపై అమిర్ ఖాన్ ప్రియురాలు.. ఇక్కడ కూడా వదలరా?

బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ ముంబైలోని బాంద్రాలో ఫోటోగ్రాఫర్ల వేధింపులకు గురయ్యారు. రోడ్డుపై నడుస్తుండగా ఫోటోగ్రాఫర్లు వెంటాడటంతో ఆమె తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Key Points

1

అమిర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ ముంబైలో కనిపించింది.

2

ఫోటోగ్రాఫర్లు ఆమెను వెంటాడటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

4

సెలబ్రిటీలను ఇలా వేధించడం సరైంది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ముంబైలో గౌరీ స్ప్రాట్‌పై ఫోటోగ్రాఫర్ల వేధింపులు

బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఈ ఏడాది అభిమానులకు బిగ్ ‌ సర్ ‌ ప్రైజ్ ఇచ్చారు . తన బర్త్ ‌ డే రోజున ప్రియురాలిని ఫ్యాన్స్ ‌ కు పరిచయం చేశారు . బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్‌ ఉన్నానని ప్రకటించి అందరికీ షాకిచ్చారు . ఆరు పదుల వయస్సులో లవ్ ‌ లో పడ్డానంటూ రివీల్ చేశారు . ఆ తర్వాత వీరిద్దరు పలు ఈవెంట్లలో జంటగా కనిపించారు .

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

ఇదిలా ఉంచితే తాజాగా అమిర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తాజాగా ముంబయిలోని బాంద్రాలో కనిపించింది . రోడ్డుపై నడుచకుంటూ వెళ్తున్న ఆమెను కొందరు ఫోటోగ్రాఫర్స్ వెంటపడ్డారు . దీంతో అసహనానికి గురైన గౌరీ .. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి .. నేను వాకింగ్ ‌ కు వెళ్తున్న అంటూ తన ఫోటోలు తీస్తున్న వారిపై మండిపడింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ‌ గా మారింది . వాకింగ్ ‌ చేసేందుకు వెళ్తున్న ఆమెను వెంటపడమేంటని నెటిజన్స్ ‌ సైతం తప్పు పడుతున్నారు . సెలబ్రిటీలను ఇలా రోడ్లపై వేధించడం సరికాదని హితవు పలుకుతున్నారు .

నెటిజన్ల ఆగ్రహం

ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే ఈ ఏడాది ‘సితారే జమీన్ పర్’ చిత్రంలో బాస్కెట్‌బాల్ కోచ్‌గా నటించి మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది . అంతేకాకుండా ఇటీవల విడుదలైన రజినీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్రలో నటించారు .

అమిర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌పై జరిగిన ఈ ఘటన సెలబ్రిటీల ప్రైవసీపై ప్రశ్నార్థకం తెలుపుతోంది. సెలబ్రిటీలను వేధించకూడదని నెటిజన్లు కోరుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.