|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Abhishek Aishwarya : మొన్న ఐశ్వర్య రాయ్.. ఇవాళ అభిషేక్ బచ్చన్.. కోర్టును ఆశ్రయించిన భార్యాభర్తలు..

Published: 10-09-2025, 9:47 AM
Abhishek Aishwarya : మొన్న ఐశ్వర్య రాయ్.. ఇవాళ అభిషేక్ బచ్చన్.. కోర్టును ఆశ్రయించిన భార్యాభర్తలు..

తాజాగా బాలీవుడ్‌లో సంచలనం! మొన్న ఐశ్వర్య రాయ్ తన ఫోటోలను అనుమతి లేకుండా వాడుతున్నారని కోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు ఆమె భర్త అభిషేక్ బచ్చన్ కూడా అదే కారణంతో కోర్టుకు వెళ్ళాడు. ఇద్దరి పిటిషన్లు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.

Key Points

1

ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తన ఫోటోల దుర్వినియోగాన్ని నిరోధించాలని కోరింది.

2

అభిషేక్ బచ్చన్ కూడా ఇదే విషయంలో కోర్టును ఆశ్రయించాడు.

4

భార్యాభర్తలిద్దరూ కోర్టును ఆశ్రయించడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

ఐశ్వర్య రాయ్ కోర్టు పిటిషన్

Abhishek Aishwarya : ఇటీవల ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా తన ఫోటోలను, పేరును తప్పుగా వాడుతున్నారని, అలా నా అనుమతి లేకుండా ఉపయోగించుకోడానికి వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును కోరింది.(Abhishek Aishwarya)

దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సంస్థలు, వ్యక్తులు ఎవరైనా ఐశ్వర్య రాయ్ పేరు, ఫొటోలు వాడకూడదు అని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఢిల్లీ హైకోర్టుని ఇదే విషయంలో ఆశ్రయించాడు.

అభిషేక్ బచ్చన్ కోర్టుకు వెళ్ళిన వివరాలు

Also See : Ritika Nayak : ‘మిరాయ్‌’ భామ రితిక నాయక్.. ఎంత క్యూట్ గా ఉందో..

కొన్ని వెబ్ సైట్స్ నా అనుమతి లేకుండా నా ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నారని, కొంతమంది వ్యక్తులు ఏఐతో నా ఫొటోలు క్రియేట్ చేసి అశ్లీల కంటెంట్ కు ఉపయోగిస్తున్నారని, నా పర్సనాలిటీ, పబ్లిసిటీ, ప్రైవసీ హక్కులకు రక్షణ కల్పించాలని పిటిషన్ వేసాడు అభిషేక్. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పించినట్టు అభిషేక్ తరపున న్యాయవాది తెలిపారు.

బాలీవుడ్‌లో చర్చ

ఇలా భార్య భర్తలు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు తమ పేరు, ఫొటోలు వాడుకోకూడదు అంటూ కోర్టులో పిటిషన్ వేయడంతో బాలీవుడ్ లో చర్చగా మారింది.

Also See : Ananya Nagalla : బాబోయ్.. షార్ట్ డ్రెస్ లో అనన్య నాగళ్ళ హాట్ పోజులు..

ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ ఇద్దరూ తమ పేరు, చిత్రాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడం బాలీవుడ్‌లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ప్రముఖుల ప్రైవసీ హక్కులపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.