|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరో నిఖిల్‌ `ది ఇండియా హౌస్‌` సినిమా సెట్‌లో ప్రమాదం

Published: 11-06-2025, 2:09 PM
హీరో నిఖిల్‌ `ది ఇండియా హౌస్‌` సినిమా సెట్‌లో ప్రమాదం

యంగ్ హీరో నిఖిల్ నటించే ‘ది ఇండియా హౌస్’ సినిమా షూటింగ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో సెట్‌లో అల్లకల్లోలం సృష్టించింది. ఈ ప్రమాదంలో కొందరు సిబ్బంది గాయపడ్డారు.

Key Points

1

నిఖిల్ నటించిన ‘ది ఇండియా హౌస్’ సినిమా సెట్‌లో ప్రమాదం.

2

భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో సెట్‌లో వరద పోటెత్తింది.

4

సెట్‌కు భారీ నష్టం సంభవించింది.

భారీ వాటర్ ట్యాంక్ పేలింది

యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రస్తుతం `ది ఇండియా హౌస్‌` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.

అయితే ఈ మూవీ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శంషాబాద్‌లో సమీపంలో జరుగుతుంది. షూటింగ్‌లో భాగంగా సముద్రం సీన్లు తీసేందుకు భారీగా సెట్‌ ఏర్పాటు చేశారు. దీంతోపాటు భారీగా వాటర్‌ ట్యాంక్‌ని కూడా ఏర్పాటు చేశారు.

వాటర్‌ ట్యాంకర్‌ పగిలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంక్‌ పగలడంతో లొకేషన్‌ మొత్తం వరదతో నిండిపోయింది. భారీ వాటర్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పగిలిపోవడంతో సెట్ మొత్తం అల్లకల్లోలం అయ్యింది.

అసిస్టెంట్ కెమెరామెన్ గాయపడ్డారు

ఈ ఘటనలో అసిస్టెంట్‌ కెమెరామెన్‌ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోది. ఆయనతోపాటు మరికొంత మందికి గాయాలైనట్టు సమాచారం. అదే సమయంలో సెట్‌ కూడా డ్యామేజ్‌ జరిగిందని, నష్టం తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

ఇక నిఖిల్‌ హీరోగా, సాయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా `ది ఇండియా హౌస్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది రూపొందుతుంది. ఈ మూవీని రామ్‌ చరణ్‌ సమర్పిస్తుండటం విశేషం. అభిషేక్ అగర్వాల్‌ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్‌ వంశీ దర్వకత్వం వహిస్తున్నారు.

సెట్‌కు భారీ నష్టం

`ది ఇండియా హౌస్‌` చిత్రం 1905 నాటి స్వాతంత్య్రం  పోరాటం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఆ స్వాతంత్య్రోద్యమ సమయంలో ప్రేమ, విప్లవం అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు.

ఇందులో అనుపమ్‌ ఖేర్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకోవడం విచారకరం.

‘ది ఇండియా హౌస్’ సినిమా షూటింగ్‌లో చోటుచేసుకున్న ఈ ప్రమాదం చిత్ర బృందాన్ని కలవరపెట్టింది. గాయపడిన వారికి త్వరిత వైద్యం లభించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.