|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మధునందన్‌కు లక్షల నష్టం: నమ్మిన స్నేహితుడే వెన్నుపోటు పొడిచాడు! అసలేం జరిగిందంటే..

Published: 06-01-2026, 10:35 PM
మధునందన్‌కు లక్షల నష్టం: నమ్మిన స్నేహితుడే వెన్నుపోటు పొడిచాడు! అసలేం జరిగిందంటే..
  • నటుడు మధునందన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలను పంచుకున్నారు.
  • నమ్మిన స్నేహితుడు హోటల్ బిజినెస్ పేరుతో 25 లక్షలు మోసం చేసినట్లు వెల్లడించారు.
  • ఈ సంఘటన తన కెరీర్‌ను, సినిమా అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని తెలిపారు.
  • ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని, ఇండస్ట్రీలో వెన్నుపోట్లు సర్వసాధారణమని మధునందన్ చెప్పారు.

నటుడు మధునందన్ తన కెరీర్‌కు దూరంగా ఉండటానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నమ్మిన స్నేహితుడి మోసంతో 25 లక్షలు కోల్పోయి, తీవ్ర నష్టం ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ అనుభవం తన జీవితంలో పెద్ద గుణపాఠం అని చెప్పారు.

మధునందన్ జీవితంలో అతి పెద్ద తప్పు

Actor Madhunandan: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు మధునందన్.. ఎన్నో సినిమాలు హీరోలకు ఫ్రెండ్ క్యారెక్టర్లో తగ్గించి బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల నుంచి విజిల్స్ వేయించుకున్నాడు.. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో కనిపించేవాడు. కానీ ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన సినిమాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి..? జీవితంలో ఆయన చేసిన అతి పెద్ద మిస్టేక్? హీరోలతో ఉన్న సంబంధాల గురించి మదన ఉందని వివరించారు. ఇన్ని రోజులు సినిమాలకు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందో? మధు ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం..

ఆయన ఇంటర్వ్యూ లో మాట్లాడాడు.. అందులో భాగంగా తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాల్లోకి ఎలా వచ్చాడు? వచ్చిన తర్వాత ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు  అని మధు బయటపెట్టారు. ఎవరైనా సరే ఫ్రెండ్ అని నమ్మకం ఉంటే సరిపోదు. కొన్నిసార్లు ఆ గుడ్డి నమ్మకమే మనల్ని దారుణంగా మోసపోయేలా చేస్తుంది.. నేను కూడా అలానే నమ్మి మోసపోయాను అని ఆయన అన్నారు. తిండి తిప్పలు మానేసి లక్షలు కూడా పెట్టి ఫ్రెండ్ వల్ల దారుణంగా మోసపోయారని చాలా సందర్భాల్లో విన్నామని యాంకర్ అడుగుతారు. దానికి ఆయన సమాధానం చెబుతూ.. దాదాపు 18 19 గంటలు గతంలో సినిమాలు చేశాను. లక్షలు సంపాదించాను. 25 లక్షల వరకు తీసుకెళ్లి మా ఫ్రెండ్ కి ఇస్తే, వాడు హోటల్ బిజినెస్ అంటూ వేరే వాడికి ఇచ్చాడు. అది బాగా లాస్ అవ్వడంతో నేను నిండా మునిగిపోయాను. ఇటు ఫ్రెండ్ అటు వాడిని అడిగి ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఎవరినీ గుడ్డిగా నమ్మి ఏది ఇవ్వకూడదు అని మధు అంటున్నాడు. సినిమాలు అలా చెయ్యి జారిపోయాయి..

స్నేహితుడితో వ్యాపారం – లక్షల నష్టం

సినిమా అవకాశాలపై మోసం ప్రభావం

ఆ తర్వాత మాడ్లతుతూ.. మీ అవకాశాలు అన్నీ మీ ఫ్రెండ్ కు వెళ్ళాయని తెలిసింది అని యాంకర్ అడుగుతాడు. మధు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఇందులో తప్పేమీ లేదు ఒకరికి రావాల్సింది మనకొస్తాయి. అలాంటివి మనవి వేరే వాళ్లకు వెళ్లడంలో తప్పేమీ లేదు ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్ అని అన్నాడు. కొన్నిసార్లు వెన్నుపోటు పొడుస్తారు కానీ మనకి రావాలి అని రాసిపెట్టి ఉంటే అవి కచ్చితంగా మన వారికి వస్తాయి అని మధు అంటున్నారు. అదృష్టం ఉంటే ఎప్పుడు ఎవరికీ ఇలా అవకాశాలు వస్తాయని చెప్పలేము.. ఇందులో వెన్నుపోటు ఏమీ లేదు కానీ అదృష్టం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము అని మధు అంటున్నారు.. అంతేకాదు హీరో నితిన్ తో ఉన్న బాండింగ్ గురించి బయటపెట్టాడు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. చిన్న సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు..

మధునందన్ అనుభవం ఎవరినైనా గుడ్డిగా నమ్మితే జరిగే పరిణామాలను తెలియజేస్తుంది. ఇండస్ట్రీలో వెన్నుపోట్లు సాధారణమే అయినా, వ్యక్తిగత నష్టం తీవ్రంగా ఉంటుందని ఆయన మాటలు స్పష్టం చేశాయి. ఈ చేదు అనుభవం తర్వాత మధునందన్ తిరిగి ఎలా నిలదొక్కుకుంటారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.