
📌 Key Points
- విలక్షణ నటుడు విద్యుత్ జామ్వాల్ మరో సంచలన వీడియోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
- నగ్నంగా చెట్టు ఎక్కి, ప్రకృతితో మమేకమవుతున్న విద్యుత్.. వీడియో వైరల్!
- కనీసం ఆకులైనా కట్టుకోవాల్సింది అంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు, ట్రోల్స్!
- యోగా ప్రక్రియలో భాగంగానే నగ్నంగా చెట్టు ఎక్కానని విద్యుత్ వివరణ.
బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఏకంగా నగ్నంగా చెట్టెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అసలు ఈ వీడియో వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?
నగ్నంగా చెట్టు ఎక్కిన విద్యుత్ జామ్వాల్..
బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ (Vidyut Jammwal)అంటే యాక్షన్, ఫిట్‌నెస్, సాహసం అనే పదాలు గుర్తుకు వస్తాయి. పలు సినిమాల్లో విలన్ పాత్రలతో మొదలైన ఆయన కెరీర్.. క్రమంగా హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన చూపించే డెడికేషన్ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇటీవల ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘మదరాసి’ (Madharaasi) సినిమా విద్యుత్ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది. ఇదిలా ఉండగా, త్వరలోనే హాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
నెటిజన్ల ఆగ్రహం.. తీవ్ర విమర్శలు!
ప్రముఖ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘స్ట్రీట్ ఫైటర్’ రీబూట్ మూవీలో విద్యుత్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా విద్యుత్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. తన ఫిట్‌నెస్, యోగా, సాహసోపేతమైన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తరచూ షేర్ చేస్తుంటాడు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆయన చేసే పోస్టులు ట్రోలింగ్‌కు కూడా దారి తీస్తుంటాయి. ముఖ్యంగా నగ్నంగా లేదా అతి బోల్డ్‌గా కనిపించే ఫొటోల కారణంగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, విద్యుత్ నగ్నంగా చెట్టు ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
సహజ యోగ ప్రక్రియలో భాగమే అంటున్న విద్యుత్.
ఇక ఈ వీడియోను స్వయంగా విద్యుత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించడం గమనార్హం. ‘‘కలరిపయట్టు సాధకుడిగా, నేను ఏడాదికి ఒకసారి ‘సహజ’ అనే యోగ ప్రక్రియను ఆచరిస్తాను. సహజ అంటే మన సహజసిద్ధమైన స్థితికి, ప్రవృత్తికి దగ్గరగా వెళ్లడం. ఇది ప్రకృతితో, మన అంతరాత్మతో మమేకమయ్యేలా చేస్తుంది. శాస్త్రీయంగా ఇది నాఢీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. శరీర సమతుల్యతను, ఏకాగ్రతను పెంచుతుంది’’ అని రాసుకొచ్చాడు. న్యూడ్‌గానే ఐస్‌లో కూర్చొని దండం పెడుతూ ఉన్న ఫొటోతో వీడియో ఎండ్ అయింది. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అది చూసిన వారంతా సిగ్గులేదా? కనీసం ఆకులైనా కట్టుకోవాల్సింది కదా అని మండిపడుతున్నారు. మరికొందరు మాత్రంబోల్డ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
విద్యుత్ జామ్వాల్ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


