
సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్‌పై నటి దివ్య పిళ్లై చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టొవినో థామస్‌తో కలిసి ‘కళాపురుష్’ చిత్రంలో నటించినప్పుడు తన అనుభవాన్ని పంచుకుంది. దర్శకుడు వినలేదని, నటుడి కింద నలిగిపోవాల్సి వచ్చిందని ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Key Points
నటి దివ్య పిళ్లై ఇంటిమేట్ సీన్స్‌పై బోల్డ్ కామెంట్స్ చేసింది.
'కళాపురుష్' సినిమాలో టొవినో థామస్‌తో ఇంటిమేట్ సీన్‌లో నటించింది.
సీన్ చేసేటప్పుడు దర్శకుడు వినలేదని, చాలా ఇబ్బందిపడ్డానని తెలిపింది.
80 కేజీల నటుడి కింద నలిగిపోతూ నటించాల్సి వచ్చిందని షాకింగ్ వెల్లడి.
దివ్య పిళ్లై సంచలన వ్యాఖ్యలు
గత కొద్ది రోజుల నుంచి సినిమాల్లో బూతు కంటెంట్ మరీ ఎక్కువైపోతుంది. హీరో,హీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సీన్స్ ఉండటం వల్ల ఫ్యామిలీ చిత్రాలు తగ్గిపోయాయి. అలాగే చాలామంది కుటుంబంతో కలిసి చూసేందుకు ఇబ్బంది పడుతున్నారు. అలాగే అలాంటి సీన్స్ చేయడానికి మాకూడా ఇబ్బందిగానే ఉందంటూ ఓ నటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మరెవరో కాదు మంగళవారం(mangalavaram), తండేల్(Thandel) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్య పిళ్లై(Divya Pillai). ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో గ్లామర్ రోల్స్‌లో నటించి ప్రశంసలు, విమర్శలు పొందింది. తాజాగా, ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్య తన తొలి సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘కళాపురుష్’ ఇంటిమేట్ సీన్ అనుభవం
‘‘నేను ‘కళాపురుష్’ అనే మలయాళం సినిమాలో టొవినో థామస్‌తో ఇంటిమేట్ సీన్‌లో నటించా. దర్శకుడు ఈ సీన్ గురించి వివరించిప్పుడు ఒప్పుకోలేదు. చుట్టూ జనం ఉండగా.. కెమెరాలలో రికార్డ్ అవుతుండగా నా వల్ల కాదని చెప్పేశాను. కోపం, బాధ ఇలా ఏ ఎమోషన్ అయినా చేస్తాను కానీ ఇంటిమేట్ సీన్స్‌లో చేయడం నా వల్ల కాదని చెప్పాను. అయినా వినలేదు.. డైరెక్టర్ చెప్పింది చేయాలని అన్నారు. కానీ ఆ తర్వాత నేను కూడా ఆలోచించా.. ఇలాంటి సీన్స్‌లో చేస్తే ప్రజలు నా గురించి, నా వ్యక్తిత్వం గురించి ఏమనుకుంటారో అనుకున్నా. కానీ టొవినో థామస్ కోసం షూటింగ్ పూర్తి చేశా.
నటుడి కింద నలిగిపోవాల్సిన పరిస్థితి
80 కేజీల బరువు ఉన్న నటుడు నాపై పడుకుని ఉన్నప్పుడు కెమెరా పొజిషన్‌కు తగినట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి. కెమెరా ఉన్నంతసేపు అతడి కింద నలిగిపోవాల్సిందే. ఆ సమయంలో ముద్దును కూడా ఎంజాయ్ చేయలేం. లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్‌లో నటించేటప్పుడు మనకు ఇబ్బంది అనిపించినా ఆ ఫీలింగ్ ఫేస్‌లో చూపించకూడదు. సహ నటుడు ఏం చేసినా కట్ చెప్పే వరకు భరిస్తూ ఉండాల్సిందే’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ గురించి తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు.
దివ్య పిళ్లై చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఇంటిమేట్ సీన్ల చిత్రీకరణపై కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. నటీనటులు ఎదుర్కొనే అసౌకర్యాన్ని ఈ కామెంట్స్ బయటపెట్టాయి. ఆమె ధైర్యానికి పలువురు మద్దతు తెలుపుతున్నారు.


