
📌 Key Points
- టాలీవుడ్, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన పేరు మోసిన హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ కేసులో నిందితుడు.
- మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో నిందితుడైన సోదరుడు పరారీలో ఉండగా పోలీసులు, ఈగల్ టీం గాలిస్తున్నారు.
- పట్టుబడ్డ వ్యాపారుల నుంచి 43 గ్రాముల కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం; హీరోయిన్ సోదరుడు కొనుగోలు చేసినట్లు సమాచారం.
- గత సంవత్సరం కూడా సైబరాబాద్ పోలీసులకు ఈ నటి సోదరుడు పట్టుబడినట్లు సమాచారం.
సినీ పరిశ్రమను కలవరపెడుతున్న డ్రగ్స్ కేసు వ్యవహారం మరోసారి సంచలనం సృష్టించింది. ఓ ప్రముఖ హీరోయిన్ సోదరుడు మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గతంలోనూ డ్రగ్స్ కేసులో పట్టుబడినట్లు సమాచారం.
డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడి ప్రమేయం
Drugs Case: గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ఈ వ్యవహారంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. మరి కొంతమంది ఈడీ విచారణ ముందు కూడా హాజరైన విషయం తెలిసిందే. ఇంకొంతమందిపై అధికారులు వేటు కూడా వేశారు. ఇలా ఎన్నో జరుగుతున్నా.. డ్రగ్స్ మాఫియాని అరికట్టడం అసాధ్యంగానే మారిపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి ఈ డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ , బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక పేరు మోసిన హీరోయిన్ సోదరుడు మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు.
అయితే ఇప్పుడు ఆమె సోదరుడు పరారీ అయినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ సోదరుడి కోసం ఈగల్ టీం తో పాటు మాసబ్ ట్యాంకు పోలీసులు కూడా గాలిస్తున్నారు. ట్రూప్ బజార్ కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ ల అరెస్టుతో ఆ నటి సోదరుడి పేరు బయటకు వచ్చింది. ఇకపోతే పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులకు నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఈ డ్రగ్స్ ను సప్లై చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి నటి సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ నెట్‌వర్క్: అరెస్టులు, గాలింపు
వీరి నుంచి 43 గ్రాముల కొకైన్ తోపాటు ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే గత సంవత్సరం కూడా సైబరాబాద్ పోలీసులకు ఈ నటి సోదరుడు పట్టుబడినట్టు సమాచారం. అయితే ఆ హీరోయిన్ పేరు, ఆమె సోదరుడి వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినట్లు సమాచారం.
గతంలోనూ చిక్కిన హీరోయిన్ సోదరుడు?
హీరోయిన్ సోదరుడి డ్రగ్స్ వ్యవహారం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది, కేసు తీవ్రత పెరుగుతోంది.


