
నటీనటుల కెరీర్‌లో కొన్ని సవాళ్లు సహజం. స్టార్ హీరోలను డాడీ అని పిలిచి, ఆ తర్వాత వారితోనే హీరోయిన్‌గా రొమాన్స్ చేయడం ఎంత కష్టమో నటి రాశి తన అనుభవం ద్వారా తెలిపారు. రాజశేఖర్‌తో ఆమె ప్రయాణం ఆసక్తికరంగా ఉంది.
Key Points
నటి రాశి బాల్యం నుంచే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు.
ఆదిత్య 369, మమతల కోవెల వంటి చిత్రాల్లో బాలనటిగా నటించారు.
రాజశేఖర్‌ని డాడీ అని పిలిచి, తర్వాత ఆయనతో హీరోయిన్‌గా రొమాన్స్ చేశారు.
'కృష్ణబాబు', 'నేటి గాంధీ' లాంటి సినిమాలు ఆమె కెరీర్‌లో మైలురాళ్ళు.
రాశి చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్‌గా
నటీనటులు ఎవరైనా కథ ప్రకారం తమకి కేటాయించిన పాత్రల్లో ఒదిగిపోయి నటించాలి. ఎలాంటి పాత్రలో నటిస్తున్నాం ? ఎవరితో నటిస్తున్నాం ? అనేది పక్కన పెట్టి తమ పాత్రకి తగ్గట్లుగా నటించాలి. అప్పుడే గుర్తింపు దక్కుతుంది. హీరోలకైనా, హీరోయిన్లకైనా కెరీర్ లో కొన్ని ఛాలెంజ్ లు తప్పవు. శుభాకాంక్షలు చిత్రంతో నటి రాశి హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది.
అనేక చిత్రాల్లో హోమ్లీగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా చేరువైంది. శుభాకాంక్షలు మూవీ కంటే ముందు నుంచే బాల్యం లోనే రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించింది. ఆదిత్య 369, మమతల కోవెల లాంటి చిత్రాల్లో రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.
రాజశేఖర్‌తో నటన: ఒక సవాలు
రాశి తన కెరీర్ లో ఎదురైనా ఛాలెంజ్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తాను చిన్నతనంలో బాలకృష్ణ లాంటి హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను. అప్పట్లో వారిని అంకుల్ అని పిలిచేదాన్ని. అలాంటి బాలయ్యకి కృష్ణబాబు సినిమాలో హీరోయిన్ గా నటించా. అదే విధంగా మమతల కోవెల సినిమాలో రాజశేఖర్ గారికి కూతురిగా నటించారు.
ఆ సినిమాలో రాజశేఖర్ గారిని డాడీ అని పిలవడం బాగా అలవాటైపోయింది. కానీ ఆయనకి నేటి గాంధీ చిత్రంలో హీరోయిన్ గా గర్ల్ ఫ్రెండ్ గా నటించా. అది పెద్ద ఛాలెంజ్. పాత్ర సరిగ్గా పండాలి అంటే డాడీ అనే ఫీలింగ్ మైండ్ లో నుంచి తీసేయాలి. సినిమా అంటే సినిమానే.. అలాగే భావించి రాజశేఖర్ గారితో నటించినట్లు రాశి తెలిపారు.
రాశి కెరీర్: ప్రముఖ చిత్రాలు
శుభాకాంక్షలు మూవీలో హీరోయిన్ గా నటించిన రాశి ఆ తర్వాత వెనుదిగిరి చూసుకోలేదు. గోకులంలో సీత, పెళ్లి పందిరి, ప్రేయసి రావే, దేవుళ్ళు లాంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. రాశి తన కెరీర్ లో శ్రీకాంత్ తో ఎక్కువ సినిమాలు చేసింది.
కథ డిమాండ్ మేరకు ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం ప్రొఫెషనల్ నటులకు తప్పనిసరి. రాశి లాంటి నటీనటులు తమ వ్యక్తిగత భావనలను పక్కన పెట్టి పాత్రకి న్యాయం చేయడం ప్రశంసనీయం.


