
📌 Key Points
- హైదరాబాద్‌లోని క్వాక్ ఏరీనా పబ్‌పై పోలీసుల దాడి, డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు.
- 46 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, 8 మందికి పాజిటివ్ అని తేలింది.
- నటి హేమ కూడా పార్టీలో పాల్గొన్నారు, డ్రగ్స్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.
- డ్రగ్స్ తీసుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కొండాపూర్లోని క్వాక్ ఏరీనా పబ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో నటి హేమ కూడా పట్టుబడ్డారు. ఆమెతో పాటు పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్వాక్ ఏరీనా పబ్‌పై పోలీసుల దాడి
Actress Hema:సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. ఈ ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడానికి సెలబ్రిటీలు నిత్యం పరితపిస్తూ ఉంటారు. అలా గజిబిజి లైఫ్ స్టైల్ లో నిత్యం షూటింగులతో బిజీగా గడిపేస్తున్న విషయం తెలిసిందే. అందుకే కాస్త సమయం దొరికితే చాలు స్నేహితులతో, ఫ్యామిలీలతో కలిసి వెకేషన్ కి వెళ్లడం.మీ లేదా పబ్ లకు వెళ్లి పార్టీలు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇకపోతే పబ్ కి వెళ్ళిన తర్వాత మద్యం, మాంసం సేవించడం వరకూ ఓకే కానీ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో బెంగళూరు శివారులలో జరిగిన ఒక పబ్ ఈవెంట్లో పాల్గొని డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ఎన్నో ఇబ్బందులు పడ్డ నటి హేమ.. ఇప్పుడు మరొకసారి ఈగల్ టీంకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం డ్రగ్ కల్చర్ ఎక్కడ చూసినా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పబ్ లలో మితిమీరుతున్న డ్రగ్స్ కల్చరపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొండాపూర్ లోని “క్వాక్ ఏరీనా పబ్” పై ఈగల్ టీమ్ తో పాటు స్థానిక పోలీసులు సంయుక్తంగా రైడ్ నిర్వహించగా.. ఆ తనిఖీలలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా పబ్ లో పార్టీ జరుగుతున్న సమయంలోనే ఆకస్మికంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. అక్కడ పబ్ లో ఎంజాయ్ చేస్తున్న సుమారుగా 46 మందికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ రాగా.. వీరిలో ఆరుగురు గంజాయి సేవించినట్లు, మరో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇకపోతే నిందితులందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు .
డ్రగ్స్ పరీక్షల్లో ఎంతమందికి పాజిటివ్?
ఇకపోతే ఇక్కడ క్వాక్ ఏరీనా పబ్ “బ్లాక్ కాఫీ” పేరుతో ఒక పెద్ద ఈవెంట్ ను నిర్వహించింది..ఈ పార్టీలో సినీనటి హేమ కూడా పాల్గొన్నారు .ఆమెకు కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు .
హేమ డ్రగ్స్ టెస్ట్ ఫలితం ఏంటి?
అయితే అందులో నెగిటివ్ వచ్చిందని తెలుపుతూ.. ఆ విషయాన్ని ఈమె తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. అందులో హేమా మాట్లాడుతూ ..”రాత్రి జరిగిన క్వాక్ ఏరీనా పబ్ పార్టీలో నాకు కూడా అధికారులు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. యూరిన్ శాంపుల్ తీసుకున్నారు. టెస్ట్ చేశారు. అయితే నాకు నెగిటివ్ వచ్చింది.. మీ హేమ ఎప్పుడూ తప్పు చేయదు. నిజాయితీగా ఉంటుంది. ముక్కు సూటిగా ఉంటుంది. అనవసరంగా నాపై దుష్ప్రచారం చేయొద్దు”.. అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. మొత్తానికైతే నటి హేమ తనకు డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది అని వీడియో షేర్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
హేమ డ్రగ్స్ కేసులో నెగిటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు పబ్‌లపై నిఘా పెంచడంతో డ్రగ్స్ వినియోగదారుల్లో భయం నెలకొంది. ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.


