|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Actress Hema : ఆ సమయంలో చిరంజీవి గారి సపోర్ట్.. వాళ్ళ మనిషిని పంపించి.. ఆ హీరో దగ్గర ఏడ్చేశాను..

Published: 02-12-2025, 9:50 PM
Actress Hema : ఆ సమయంలో చిరంజీవి గారి సపోర్ట్.. వాళ్ళ మనిషిని పంపించి.. ఆ హీరో దగ్గర ఏడ్చేశాను..
  • డ్రగ్స్ కేసులో ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు హేమకు క్లీన్ చిట్ ఇచ్చింది.
  • కష్టకాలంలో చిరంజీవి గారు మనిషిని పంపి సపోర్ట్ అందించారు.
  • నాగార్జునతో మాట్లాడినప్పుడు తన బాధను తట్టుకోలేక ఏడ్చేశానని హేమ తెలిపింది.
  • విష్ణు కూడా మెంబర్షిప్ తిరిగి ఇచ్చి హేమకు అండగా నిలిచారు.

డ్రగ్స్ కేసులో నిర్దోషిగా తేలిన నటి హేమ, ఇటీవల ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది. కష్టకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర హీరోలు తనకు ఎలా అండగా నిలిచారో ఈ సందర్భంగా వెల్లడించింది.

డ్రగ్స్ కేసులో హేమకు క్లీన్ చిట్

Actress Hema: సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ తీసుకుందని ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళొచ్చింది. ఈ కేసులో హేమ తానేమి తప్పు చేయలేదని పోరాడింది. ఇటీవలే ఆ కేసులో హేమ ఎలాంటి తప్పు చేయలేదని, డ్రగ్స్ తీసుకోలేదని కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ కేసు తర్వాత హేమ 10 టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా పలు అంశాలపై మాట్లాడింది.(Actress Hema)

ఈ క్రమంలో హేమపై ఆరోపణలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎలా సపోర్ట్ చేసింది, ఎలా స్పందించింది అని మాట్లాడారు.

కష్టకాలంలో చిరంజీవి అండ

హేమ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నాకు అందరూ సపోర్ట్ చేసారు. లాయర్లు కావాలా, కార్ కావాలా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తామన్నారు. నేను పనిచేసిన హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు అంతా సపోర్ట్ చేసారు. చిరంజీవి గారు అయితే వాళ్ళ మనిషిని పంపి తనేంటో మనకు తెలుసు తనకు ఏం కావాలో చూడండి, డబ్బులు కావాలా, లాయర్లు కావాలా అడగండి అని సపోర్ట్ చేసారు. రీసెంట్ గా నాగార్జున గారు కూడా మాట్లాడారు. ఆయన దగ్గర అయితే ఏడ్చేసాను. నా ఫేవరేట్ హీరో ఆయన అని అందరికి తెలుసు, ఆయనకు కూడా తెలుసు. నేను అసలు మందే తాగను కదా అని నాగార్జున గారే అన్నారు. ఆయనకు తెలుసు నా గురించి అని తెలిపింది.

నాగార్జున వద్ద ఏడ్చేసిన హేమ

ఇక విష్ణు కూడా మా మెంబర్షిప్ అతను లేనప్పుడు సస్పెండ్ చేస్తే వచ్చి నా కార్డ్ మళ్ళీ నాకు ఇచ్చారు. నిజం తేలేదాకా నిందలు వేయొద్దు అంటూ నాకు సపోర్ట్ చేసారు అని తెలిపింది హేమ.

ఆ కష్ట సమయాన్ని అధిగమించి, ఇండస్ట్రీ మద్దతుతో తిరిగి నిలబడిన హేమ, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేసింది. తనను నమ్మినవారికి, మద్దతు ఇచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.