|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Actress Hema: అనారోగ్య కారణాలతో హేమ తల్లి కన్నుమూత

Published: 18-11-2025, 6:20 AM
Actress Hema: అనారోగ్య కారణాలతో హేమ తల్లి కన్నుమూత

తెలుగు నటి హేమ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి కన్నుమూశారు. డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్ తర్వాతే తల్లి ఆరోగ్యం క్షీణించిందని హేమ స్వయంగా వెల్లడించారు. ఈ వార్త సినీ వర్గాల్లో విషాదం నింపింది.

Key Points

1

నటి హేమ తల్లి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.

2

కోళ్ల లక్ష్మి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో తుదిశ్వాస విడిచారు.

4

తల్లి మరణ వార్త తెలుసుకున్న హేమ స్వగ్రామానికి చేరుకుని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

నటి హేమకు మాతృవియోగం

తెలుగులో పలు సినిమాల్లో సహాయ నటిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న హేమ.. గతంలో బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. గత కొన్నాళ్లుగా అయితే మూవీస్‌లో యాక్ట్ చేయట్లేదు. కానీ గతేడాది ఓ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలతో ఈమెని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బయటకొచ్చిన హేమ.. తను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పింది. కానీ తను జైలుకెళ్లడం చూసి తల్లి తట్టుకోలేకపోయిందని, అనారోగ్యానికి గురైందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఇప్పుడు ఆరోగ్యం క్షీణించడంతో హేమ తల్లి తుదిశ్వాస విడిచింది.

హేమ తల్లి కోళ్ల లక్ష‍్మి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు. సోమవారం రాత్రి ఈమె తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న హేమ.. స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. నిన్న ఉదయం తనతో బాగానే మాట్లాడిందని, ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయిందని చెబుతూ గట్టిగా ఏడ్చేసింది.

తల్లి ఆరోగ్యంపై డ్రగ్స్ కేసు ప్రభావం

స్వగ్రామంలో అంత్యక్రియలు

హేమ తల్లి మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గతంలో జరిగిన సంఘటనల ప్రభావం ఆమె తల్లి ఆరోగ్యంపై పడిందని హేమ చెప్పిన మాటలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రార్థిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.