
నటి హేమ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు వెల్లడించారు. మా ఇంటి ఫంక్షన్‌కు నాగార్జున వచ్చినప్పుడు ఏం జరిగింది, డిప్రెషన్ కారణంగా బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆమె వివరించారు.
Key Points
ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లు: హేమ కెరీర్ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంపై కీలక వ్యాఖ్యలు.
డిప్రెషన్, హార్మోన్ల మార్పుల వల్ల బిగ్‌బాస్‌కు వెళ్లానని వెల్లడించిన నటి హేమ.
కూతురి మెచ్యూరిటీ ఫంక్షన్లో నాగార్జున, అమలను ఫోటోల కోసం ఇబ్బందిపెట్టడంతో వెనక్కి పంపించిన వైనం.
2024లో తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నానని, ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని సంచలన వ్యాఖ్యలు.
నటి హేమ కెరీర్, వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి హేమ ( Actress Hema ). టాలీవుడ్‌లో వందలాది సినిమాలు చేసిన ఆమె ఇటీవలి కాలంలో ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ వస్తోంది. తాజాగా తన జర్నీ గురించి యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకుంది. హేమ మాట్లాడుతూ.. అమ్మకు సినిమాలంటే ఇష్టం. అలా నేను ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మ సపోర్ట్ లేకపోతే నేనింతవరకు వచ్చేదాన్ని కాదు. ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లవుతోంది.
పెళ్లయ్యాక ఎంజాయ్‌మెంట్ లేదు కెరీర్ బాగున్నప్పుడే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సినిమాకు, ఫంక్షన్‌కు, ఓ ఇంటర్వ్యూకు.. అలా కాసేపు బయటకు వెళ్దామన్నా సరే మా ఆయన రాడు. తను రిజర్వ్‌డ్‌గా ఉంటాడు. పొద్దున్నే లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్‌కు వెళ్లేదాన్ని. తిరిగి రాగానే మళ్లీ వంట చేసేదాన్ని. అలా క్షణం తీరిక లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాను. నా లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ లేకుండా పోయింది.
డిప్రెషన్‌తో బిగ్‌బాస్‌కు.. నాగార్జునతో ఎదురైన సంఘటన
అందుకే బిగ్‌బాస్‌కు వెళ్లా.. లాక్‌డౌన్‌లో 40 ఏళ్ల వయసు దాటేశాను. ఆ వయసులో నా శరీరంలో హార్మోన్లలో మార్పు మొదలైంది. డిప్రెషన్ ఛాయలు కనిపిస్తున్నాయి. నాకెవరి టార్చర్ లేదు, అయినా తెలియని కోపం, బాధ.. ఎందుకో నాకే అర్థం కాలేదు. అప్పుడు బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో షోకి వెళ్లిపోయా.. బిగ్‌బాస్ హౌస్‌లో అందరికీ బాగా వండిపెట్టాను. నాకు నాగార్జునగారంటే చాలా ఇష్టం. ఆయనకు నేను ఎదురుచెప్పలేను. బహుశా అందుకే నన్ను వారం రోజులకే ఎలిమినేట్ చేశారు. కానీ ఆ షో వల్ల ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లతో కలిసి చిల్ అయ్యేదాన్ని.
నాగార్జున వస్తే.. త్వరగానే డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. చిన్న చిన్న బిజినెస్‌లు చేశాను. నా కూతురి మెచ్యూరిటీ ఫంక్షన్‌కి నాగార్జున, అమలతో కలిసి వచ్చారు. గంటన్నరసేపున్నారు. ఇంకా ఉండాలనుకున్నారు. కానీ అక్కడున్నవాళ్లు ఫోటోల కోసం ఇబ్బందిపెడుతుండటంతో ఇక వెళ్లిపోండి.. అని నాగార్జునను బతిమాలి పంపించేశాను. నా జీవితంలో అనుభవించని కష్టాలు, ఇబ్బందులన్నీ ఒక్క 2024లోనే ఫేస్ చేశాను. ఏ తప్పు చేయకపోయినా కష్టాలపాలయ్యాను. ఒకానొక సమయంలో చచ్చిపోవాలనిపించింది లేదంటే ఎవరినైనా చంపేయాలనిపించింది అని హేమ చెప్పుకొచ్చింది. ఈ నటి తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొంది.
2024లో ఎదురైన కష్టాలు, ఆత్మహత్య ఆలోచనలు
మొత్తంగా, నటి హేమ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, డిప్రెషన్‌ను, అలాగే నాగార్జునతో జరిగిన ఆసక్తికర సంఘటనను నిర్మొహమాటంగా పంచుకున్నారు. ఆమె మాటలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారాయి.


