|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దాడి కేసులో లక్ష్మీ మేనన్‌కు ముందస్తు బెయిల్‌

Published: 28-08-2025, 12:51 AM
దాడి కేసులో లక్ష్మీ మేనన్‌కు ముందస్తు బెయిల్‌

మలయాళ సినిమా నటి లక్ష్మీ మేనన్‌కు కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఐటీ ఉద్యోగిపై దాడి కేసులో ఆమెకు ఈ ఉపశమనం లభించింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం తగ్గింది.

Key Points

1

మలయాళ నటి లక్ష్మీ మేనన్‌కు కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

2

ఐటీ ఉద్యోగిపై దాడి చేసినట్లు ఆరోపణలు.

4

సెప్టెంబర్‌ 17 వరకు లక్ష్మీ మేనన్‌ను అరెస్ట్‌ చేయకూడదని కోర్టు ఆదేశించింది.

కోర్టు తీర్పు

మలయాళ నటి లక్ష్మీ మేనన్‌ (Lakshmi Menon)కు కోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్‌ను తాత్కాలికంగా ఆపేయాలంటూ కేరళ కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సోషల్‌మీడియాలో లక్ష్మీ మేనన్‌ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. కొచ్చిలోని ఐటీ ఉద్యోగిపై తన స్నేహితులతో కలిసి కిడ్నాప్‌ చేయడమే కాకుండా అతడిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేయగా నటి లక్ష్మీ మేనన్‌ పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి.

దాడి కేసు వివరాలు

లక్ష్మీ మేనన్‌పై కేసు నమోదు కావడంతో ఆమె ముందస్తు బెయిల్‌ కోసం కేరళ కోర్టును సంప్రదించారు. దీంతో న్యాయస్థానం కూడా ఆమెకు సానుకూలంగానే  ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్‌ 17వరకు ఆమెను అరెస్ట్‌ చేయకండి అంటూ పోలీసులను సూచించింది. అయితే, ఆమె స్నేహితులు మిథున్, అనీష్, సోనమోల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

లక్ష్మీ మేనన్‌ నేపథ్యం

అసలు కారణం ఏంటి..? లక్ష్మీ మేనన్‌ వివాదంలో పోలీసులు ఇలా చెప్పారు. ‘ఓ బార్‌ వద్ద లక్ష్మీ మేనన్‌, ఐటీ ఉద్యోగి టీమ్‌ మధ్య మొదట వివాదం వచ్చింది. ఇరు గ్రూపుల మధ్య మాటకుమాట పెరిగింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఐటీ ఉద్యోగిని లక్ష్మీ మేనన్‌తో పాటు ఆమె స్నేహితులు వెంబడించారు. ఆపై అతడిని దాడిచేశారు.  కేరళ కొచ్చికి చెందిన లక్ష‍్మీ మేనన్.. తమిళ, మలయాళంలో హీరోయిన్‌గా చేసింది. 2011 నుంచి సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది ‘శబ్దం’ అనే మూవీ చేసింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే.

కోర్టు తీర్పుతో లక్ష్మీ మేనన్‌కు తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే, కేసు విచారణ ఇంకా జరుగుతుంది కాబట్టి ఆమెకు ఇంకా చట్టపరమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.