|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలకృష్ణతో నటించలేనన్న రాశి! ప్రభాస్ విషయంలో సంచలన నిర్ణయం!

Published: 02-04-2026, 8:35 AM
బాలకృష్ణతో నటించలేనన్న రాశి! ప్రభాస్ విషయంలో సంచలన నిర్ణయం!
  • నటి రాశి బాలకృష్ణతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు.
  • బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఫీలింగ్స్ రావట్లేదని రాశి అన్నారు.
  • ప్రభాస్‌కు తల్లిగా నటించనని, అక్కగా నటిస్తానని రాశి తెలిపారు.
  • రాశి సెకండ్ ఇన్నింగ్స్‌లో తల్లి పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

సీనియర్ నటి రాశి బాలకృష్ణతో హీరోయిన్‌గా నటించడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో ఆయనకు కూతురిగా నటించడం వల్ల ఫీలింగ్స్ రావట్లేదని ఆమె అన్నారు. ప్రభాస్ విషయంలో కూడా ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బాలకృష్ణతో నటించడంపై రాశి కామెంట్స్

Actress Rasi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి రాశి (Rasi)ఒకరు. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ అందుకున్న ఈమె ఇప్పుడు బుల్లితెర సీరియల్స్ చేస్తున్నారు. అదే విధంగా పలు సినిమాలలో, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల రాశి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన కెరీర్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో బాలకృష్ణ(Balakrishna)తో నటించడం గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సీనియర్ నటుడు బాలకృష్ణ గారితో సినిమాలు చేస్తే నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని ఈమె తెలిపారు. చిన్నప్పుడే తాను బాలకృష్ణ సినిమాలో ఆయనకు కూతురిగా నటించానని అందుకే పెద్దయిన తర్వాత ఆయన పక్కన హీరోయిన్గా నటించాలి అంటే తనకు ఫీలింగ్స్ రావడం లేదు అంటూ రాశి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాశి బాలకృష్ణ నటించిన బాలగోపాలుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇలా బాలకృష్ణ కూతురుగా ఈ సినిమాలో నటించిన ఈమె అనంతరం కృష్ణ బాబు అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు.

ప్రభాస్‌తో నటించే అవకాశంపై రాశి స్పందన

ఇలా ఈ సినిమాలో మినహా రాశి తిరిగి బాలకృష్ణ నటించిన ఏ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించకపోవడం గమనార్హం. ఈమె బాలకృష్ణతో మాత్రమే కాకుండా రాజశేఖర్ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు అందుకే పెద్దయిన తర్వాత ఈ హీరోలతో కలిసి నటించడం కోసం కాస్త ఇబ్బంది పడినట్లు తెలిపారు. కేవలం రాశి మాత్రమే కాకుండా మీనా శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లు సైతం చైల్డ్ ఆర్టిస్టులుగా హీరోలకు కూతురి మనవరాలుగా నటించి, వారి సరసన తిరిగి హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఇక రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

తల్లి పాత్రలలో నటిస్తున్న రాశి..

సెకండ్ ఇన్నింగ్స్‌లో రాశి బిజీ షెడ్యూల్

ఇక ఈమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటిస్తూ సందడి చేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో రాశి తల్లి పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈమె ప్రభాస్ సినిమాలో నటించడం గురించి చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కు తాను తల్లిగా మాత్రం నటించను కానీ అక్క పాత్రలలో నటిస్తానని తనది ప్రభాస్ ది ఒకటే వయసు కావడంతో ప్రభాస్ తల్లిగా మాత్రం నటించనని, ఈమె ప్రభాస్ సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చారు.

రాశి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత బిజీగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.