|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… గుండెపోటుతో నటి షెఫాలీ జరివాలా మృతి !

Published: 27-06-2025, 8:17 PM
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం... గుండెపోటుతో నటి షెఫాలీ జరివాలా మృతి !

సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి మరియు మోడల్ షెఫాలీ జరివాలా గుండెపోటుతో మరణించారు. ముంబైలో ఆమె అర్ధరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

Key Points

1

ప్రముఖ నటి షెఫాలీ జరివాలా గుండెపోటుతో మృతి.

2

ముంబైలో అర్ధరాత్రి గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు.

4

బాలీవుడ్, కన్నడ సినిమాల్లోనూ నటించారు.

షెఫాలీ జరివాలా అకాల మృతి

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులను ఇండస్ట్రీ కోల్పోయింది. అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో పెను విషాదం నెలకొంది. సినీనటి, ప్రముఖ మోడల్ షెఫాలీ జరివాలా మరణించారు. గుండెపోటుతో చెప్పాలి మరణించినట్లు చెబుతున్నారు.

గుండెపోటుతో మరణం

ముంబైలో అర్ధరాత్రి గుండెపోటు రావడంతో.. సినీ నటి షెఫాలీ జరివాలా (Shefali Jariwala) తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. దీంతో ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఆమె మృతి నేపథ్యంలో… ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సాయంత్రం ఆమె అంత్యక్రియలు కూడా జరుగనున్నాయి.

సినిమా, టీవీ రంగం సంతాపం

కాంటా లగా మ్యూజిక్ వీడియోలతో షెఫాలీ జరివాలా.. పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ముజ్ సే షాది కరోగి, కన్నడ ఇండస్ట్రీలో హుడుగురు లాంటి సినిమాలు చేసింది. అలాగే సీరియల్స్, వెబ్ సిరీస్ లు కూడా చేసింది ఈ అందాల తార. అయితే హిందీ బిగ్ బాస్ 13 లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నారు.

షెఫాలీ జరివాలా మృతితో సినీ, టీవీ పరిశ్రమ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.