|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేను సైకో కిల్లర్ ఏంటీ అనుకుంటారు.. కానిస్టేబుల్ కనకం ఓటీటీ సిరీస్‌పై హీరోయిన్ వర్ష బొల్లమ్మ కామెంట్స్

Published: 05-07-2025, 9:16 PM
నేను సైకో కిల్లర్ ఏంటీ అనుకుంటారు.. కానిస్టేబుల్ కనకం ఓటీటీ సిరీస్‌పై హీరోయిన్ వర్ష బొల్లమ్మ కామెంట్స్

తెలుగు సినీ నటి వర్ష బొల్లమ్మ తన తాజా సినిమా ‘తమ్ముడు’ మరియు ‘కానిస్టేబుల్ కనకం’ అనే ఓటీటీ సిరీస్ గురించి మాట్లాడుతూ, సైకో కిల్లర్ పాత్రలో నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేసింది.

Key Points

1

వర్ష బొల్లమ్మ తన తాజా సినిమా 'తమ్ముడు' మరియు ఓటీటీ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం' గురించి మాట్లాడింది.

2

ఆమె 'కానిస్టేబుల్ కనకం'లోని తన పాత్ర గురించి, మరియు సైకో కిల్లర్ పాత్రలో నటించాలనే తన కోరికను వెల్లడించింది.

4

వర్ష బొల్లమ్మ త్వరలో మరిన్ని ఓటీటీ సిరీస్‌లు మరియు సినిమాల్లో కనిపించనున్నట్లు తెలిపింది.

వర్ష బొల్లమ్మ ‘తమ్ముడు’ సినిమా గురించి

తెలుగు బ్యూటిపుల్ హీరోయిన్స్‌లలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఇటీవల రిలీజైన తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, తమ్ముడు విడుదలకు ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తను నటించే ఓటీటీ సిరీస్‌ లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ వర్ష బొల్లమ్మ.

“హీరో నితిన్ చాలా కామ్‌గా ఉంటారని ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ, ఆయన చాలా ఫన్ పర్సన్. అడవిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్స్ అవీ ఏమీ లేవు. మేము సరదాగా మాట్లాడుకునేవాళ్లం. చిన్నా, పెద్దా ప్రతి ఆర్టిస్టుకు ఆయన గౌరవం ఇచ్చేవారు. నేను జోక్స్ చెప్పి ఆయనను విసిగించా” అని వర్ష బొల్లమ్మ చెప్పింది.

“నాకు అనిపించింది సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటా. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పర్‌ఫార్మ్ చేసేప్పుడు అప్పటికప్పుడు ఏదైనా అనిపిస్తే చెప్పాను. కానీ, డైరెక్టర్ గారు డైలాగ్‌లో ఉన్నది ఉన్నట్లు స్ట్రిక్ట్‌గా చెప్పమనేవారు. నేను ఓటీటీ మూవీ మిడిల్ క్లాస్ మెలొడీస్ చేసినప్పుడు స్పాంటేనియస్‌గా చాలా ఇంప్రూవ్ చేసి డైలాగ్స్ చెప్పాం. ఆ మూవీకి అలా కుదిరింది” అని వర్ష బొల్లమ్మ తెలిపింది.

‘కానిస్టేబుల్ కనకం’ ఓటీటీ సిరీస్ పై అభిప్రాయాలు

“తమ్ముడు మూవీ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. అయితే ఇందులో అనేక లేయర్స్ ఉంటాయి. నా క్యారెక్టర్‌కు సంబంధించి సాలిడ్ యాక్షన్ ఉంటుంది. మొత్తంగా మూవీలో యాక్షన్ సీక్వెన్సులు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి” అని వర్ష బొల్లమ్మ పేర్కొంది.

“కొన్ని సినిమాలు థియేటర్స్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. తమ్ముడు అలాంటి సినిమా. విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. మంచి సౌండింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు” అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది.

భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి

“ప్రస్తుతం కానిస్టేబుల్ కనకం అనే ఓటీటీ వెబ్ సిరీస్‌ లో నటిస్తున్నాను. దీంతో పాటు మరో ఓటీటీ సిరీస్ చేస్తున్నా. రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. వాటి డీటెయిల్స్ త్వరలో చెబుతా” అని వర్ష బొల్లమ్మ తెలిపింది. అయితే, ఇటీవల కానిస్టేబుల్ కనకం కాస్తా కాంట్రవర్సీ అయిన విషయం తెలిసిందే.

“సైకో కిల్లర్ క్యారెక్టర్‌లో కనిపించాలనేది నా కోరిక. నేను సైకో కిల్లర్ ఏంటీ అనుకుంటారు. కానీ, మనం ఆ జోనర్ మూవీస్ చూస్తే ఎవరూ ఊహించని పాత్రలే క్రైమ్స్ చేస్తుంటాయి. అలాంటి అవకాశం వస్తే నటిస్తా” అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది.

వర్ష బొల్లమ్మ తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. ఆమె నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.