
📌 Key Points
- అడవి శేష్ ‘డెకాయిట్’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది, సినిమా స్టోరీ లీక్ అయింది – హిందూపురం బ్యాక్‌డ్రాప్‌లో కథ!
- కరోనా కష్టాల్లో అక్క కోసం తమ్ముడి పోరాటం, హాస్పిటల్ మాఫియాపై యుద్ధం – ఎమోషనల్ యాక్షన్ డ్రామా!
- సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు, యూ ఏ సర్టిఫికేట్ – ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందట!
- మృణాల్ ఠాకూర్ హీరోయిన్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర – భారీ యాక్షన్ సీక్వెన్స్ లు గ్యారెంటీ!
అడవి శేష్ మరోసారి తన థ్రిల్లర్ టచ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘డెకాయిట్’ మూవీ ఫస్ట్ రివ్యూ ఇప్పుడు హాట్ టాపిక్. హిందూపురం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం!
హిందూపురం బ్యాక్‌డ్రాప్‌లో డెకాయిట్ కథ!
అడవి శేష్ థ్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. అదేసమయంలో చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇప్పుడు `డెకాయిట్` చిత్రంతో వస్తున్నాడు. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. వీరితోపాటు ప్రకాష్ రాజ్, సునీల్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సమర్పకులు. ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో `డెకాయిట్` మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. సినిమాని చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే మూవీ స్టోరీ ఏంటో తెలిసిపోయింది. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యూ ఏ సర్టిఫికేట్‌ని పొందింది. సినిమా రెండు గంటల ముప్పై నిమిషాలు(150 మినిట్స్) నిడివితో ఉంటుందట. సినిమా పూర్తి యాక్షన్ ప్రధానంగా, ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా సాగుతుందని, ప్రేమ కథ ఆడియెన్స్ మనసులో నిలిచిపోతుందని, లవ్ స్టోరీలో యాక్షన్ ని చూసి సర్ ప్రైజ్ అవుతారని అడవి శేష్ తెలిపారు.
ఫస్ట్ రివ్యూ: అడవి శేష్ యాక్షన్ అదుర్స్!
సినిమా ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ చూస్తే, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుందని, క్లైమాక్స్ కి ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుందని, సినిమాని మలుపు తిప్పుతుందని అంటున్నారు. టీజర్, ట్రైలర్‌లో చూపించినవి కొంతే అని, సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయని అంటున్నారు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుందని, భారీ యాక్షన్‌కి, ఎమోషన్స్ తోడు కావడం హైలైట్‌గా నిలుస్తుందని టాక్. ప్రేమ, ద్రోహం, ప్రతీకారమే సినిమా అని టాక్. విజువల్స్ మైండ్ బ్లోయింగ్. టెక్నీకల్‌గా సినిమా సాలిడ్‌గా ఉంటుందని సమాచారం.
ట్విస్టులతో నిండిన స్క్రీన్ ప్లే!
సినిమా కథ గురించి చూస్తే, ఇది హిందూపురం బ్యాక్ డ్రాప్‌లో సాగుతుందట. కరోనా నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, హీరో తన అక్క ఆసుపత్రి బిల్లులు దారుణంగా వస్తాయని, వాటి కోసం హీరో దొంగతనాలు చేయాల్సి వస్తుందట. కరోనా సమయంలో హీరో ఫ్యామిలీ పడే స్ట్రగుల్స్ మెయిన్‌గా ఉంటాయని, ఆసుపత్రి మాఫియాపై హీరో చేసే పోరాటమే సినిమా అని తెలుస్తోంది. అక్క కోసం, తన ప్రేమ కోసం హీరో చేసే పోరాటం హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. కథ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందని అంటున్నారు. కానీ ఈ మూవీకి పెద్దగా బజ్ లేదు. కంటెంట్ ఆకట్టుకోవడం లేదు. యాక్షన్ సీన్లు ఉన్నాయి,థ్రిల్లర్ ఉంది, కానీ ఎమోషన్స్ కనెక్ట్ కావడం లేదు. అందుకే బజ్ క్రియేట్ కాలేదు. ఇదే ఈ మూవీకి పెద్ద మైనస్. ఇది థియేటర్లోనే నిరూపించుకోవాలి. మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
‘డెకాయిట్’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అడవి శేష్ మరో హిట్ కొడతాడా లేదా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


