
‘సీతారామం’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న మృణాల్ ఠాకూర్, తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న డిప్రెషన్, ఆత్మహత్యాయత్నం గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Key Points
మృణాల్ ఠాకూర్ డిప్రెషన్‌ను ఎదుర్కొంది.
ఆమె లోకల్ ట్రైన్ నుంచి దూకాలని ప్రయత్నించింది.
తల్లిదండ్రుల ఆలోచనతో ఆమె ఆత్మహత్యాయత్నాన్ని ఆపేసింది.
ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు
‘సీతారామం’(Seetaramam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో సీరియల్లో హీరోయిన్‌గా నటించిన ఈ చిన్నది ఈ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలాగే తన అందచందానికి తెలుగువారు ఫిదా అయ్యారు. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని మంచి స్టార్‌డమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అడివి శేష్(Adivishesh) ‘డెకాయిట్’(Decoit), అల్లు అర్జున్(Allu Arjun)-అట్లీ(Atlee) సినిమాలు ఉన్నాయి.
డిప్రెషన్‌తో పోరాటం
ఇక నిత్యం ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం నెట్టింట తన గ్లామర్‌తో రచ్చ రచ్చ చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘సీరియల్స్‌తో గుర్తింపు వచ్చాక సినిమా ప్రయత్నాలు చేశాను. సినిమాలకు ఆడిషన్స్‌కి వెళ్ళినప్పుడు టీవీ నటి అని చులకనగా చూసేవాళ్ళు. దాని వల్ల డిప్రెషన్‌కి కూడా గురయ్యాను. ఓ సారి ఆ డిప్రెషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి చనిపోవాలని అనుకున్నా.. కానీ పేరెంట్స్ గుర్తొచ్చి ఆగిపోయాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆత్మహత్యాయత్నం నుండి తప్పించుకోవడం
Samantha: చీరలో సమంత.. అయ్యో పాపం అంటూ ఏడుస్తున్న ఎమోజీలను జోడిస్తున్న నెటిజన్లు
మృణాల్ ఠాకూర్ నిజ జీవిత సంఘర్షణను తెలియజేయడం ద్వారా, మనోవేదనలతో బాధపడే వారికి ఆశాకిరణంగా నిలుస్తుంది. ఆమె ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకం.


