
📌 Key Points
- డెకాయిట్ సినిమాలో మదనపల్లె యాసలో డైలాగ్స్ చెప్పడం కష్టమన్న శేష్.
- మృణాల్ ఠాకూర్ పాత్ర డెకాయిట్ చిత్రంలో చాలా కీలకమని వెల్లడి.
- G2, డెకాయిట్ సినిమాలతో 2026లో డబుల్ ట్రీట్ ఉంటుందని శేష్ హామీ.
- కేవలం థియేట్రికల్ సినిమాలు మాత్రమే చేస్తానని స్పష్టం చేసిన అడివి శేష్.
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో చిట్ చాట్ చేశారు. డెకాయిట్, హిట్ 4, G2 వంటి సినిమాలపై ఆసక్తికర విషయాలు పంచుకుంటూ, 2026లో డబుల్ ట్రీట్ గ్యారంటీ అని అభిమానులకు హామీ ఇచ్చారు. ఈ సంభాషణలోని ముఖ్యాంశాలు ఇక్కడ.
డెకాయిట్, హిట్ 4పై శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అడివి శేష్ బుధవారం తన బర్త్ డే సందర్భంగా నెటిజన్లతో చిట్ చాట్ చేశారు. ఎక్స్ లో అభిమానులు తనను అడిగిన ప్రశ్నలకు సూటిగా సుత్తిలేకుండా సమాధానాలిచ్చారు. డెకాయిట్, హిట్ 4 సినిమాల గురించే నెటిజన్లు ఆయన్ను ఎక్కువగా ప్రశ్నలడిగారు. ఓ నెటిజన్ డెకాయిట్ షూటింగ్ ఏది కష్టంగా అనిపించిందని అడగ్గా.. ఒకేరోజు మదనపల్లె యాసలో, మరోవైపు హిందీలో డైలాగ్స్ చెప్పడం కష్టంగా అనిపించిందని బదులిచ్చారు. అంటే ఈ సినిమాలో అడివి శేష్ మదనపల్లె బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తిగా కనిపించనున్నారంటూ నెటిజన్లలో కకొత్త అంచనాలు మొదలయ్యాయి. అలాగే మృణాల్ యాక్టింగ్ ఈ మూవీలో ఎలా ఉంటుందని మరొకరు అడగ్గా.. సినిమాలో ఆమె చాలా కీలకమని తెలిపారు.
2026లో డబుల్ ట్రీట్: శేష్ హామీ
ఇక హిట్ 3 క్లైమాక్స్ లో కనిపించినట్లే.. హిట్ 4లో కూడా కనిపిస్తారా అని మరొక నెటిజన్ అడగ్గా.. ఈ ప్రశ్న డైరెక్టర్ శైలేష్ ను అడగాలని సూచించారు. ఏదైనా వెబ్ సిరీస్ లో నటించే ఆలోచన ఉందా అని అభిమాని ప్రశ్నించగా.. తాను కేవలం థియేట్రికల్ సినిమాలు మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. తమిళ భాష అర్థమవుతుందా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శేష్ చెప్పిన సమాధానం తెలిస్తే కాస్త నవ్వుకుంటారు. రాజా రాణి వంటి సినిమాల్లో తమిళం అర్థమవుతుంది కానీ.. పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాల్లో అది చాలా కష్టమని, తమిళనం నేర్చకోవడం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.
మొబైల్స్ ఆఫ్ చేయాలంటూ నెక్స్ట్ జనరేషన్‌కు సలహా
2026లో G2, డెకాయిట్ సినిమాల రిలీజులతో డబుల్ ట్రీట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడిగిన నెటిజన్ కు.. 100 శాతం ఉంటుందని శేష్ చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చే నెక్స్ట్ జనరేషన్ కు ఏం సజెషన్ ఇస్తారని మరొకరు అడగ్గా.. రాసేటపుడు, యాక్ట్ చేసేటపుడు, సినిమా తీసేటపుడు మొబైల్స్ ఆఫ్ చేసుకోవాలని చెప్తానన్నారు.
మొత్తంగా, అడివి శేష్ అభిమానులతో జరిపిన సంభాషణ వారిని ఎంతో ఉత్సాహపరిచింది. తన రాబోయే చిత్రాలతో పాటు 2026లో రాబోయే డబుల్ ట్రీట్పై ఆయన ఇచ్చిన హామీ, అభిమానుల అంచనాలను మరింత పెంచింది.


