
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అడివి శేష్, సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది స్వచ్ఛమైన, హృదయాన్ని తాకే ప్రేమ కథ అని కొనియాడారు. ప్రీమియర్‌లు వేయాలని చిత్ర బృందానికి సూచించారు.
Key Points
అడివి శేష్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ ట్రైలర్, కొన్ని సీన్స్‌ను చూశారు.
సినిమా స్వచ్ఛమైన, హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ అని ప్రశంసించారు.
‘కేరాఫ్ కంచరపాలెం’ తరహాలో ప్రీమియర్‌లు వేయాలని చిత్ర బృందానికి సూచించారు.
అఖిల్, తేజస్విని, చైతూ నటనకు అడివి శేష్ కితాబు ఇచ్చారు.
అడివి శేష్ ప్రశంసలు
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు చిత్ర బృందం. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అడివి శేష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘రాజు వెడ్స్ రాంబాయి సినిమా ట్రైలర్, కొన్ని సీన్స్ చూశాను. ఇలాంటి మంచి కంటెంట్‌ను ప్రమోట్ చేసేందుకే ఈ ఈవెంట్‌కు వచ్చాను. కేరాఫ్ కంచెరపాలెం సినిమాను అనేక చోట్ల సైలెంట్‌గా ప్రీమియర్స్ వేశారు. మీరు కూడా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను రిలీజ్ ముందే ఈ వారం రోజులు వివిధ చోట్ల ప్రీమియర్స్ వేయండి. అప్పుడు రిలీజ్ టైమ్‌కు ప్రేక్షకులే ముందుకు వస్తారు. అంతమంచి మూవీ ఇది. ఇందులో అఖిల్, తేజస్విని, చైతూ బాగా నటించారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కు కూడా వస్తాను. చైతు జొన్నలగడ్డకు నా సినిమాలో అవకాశం ఇస్తా. వైరల్ కంటెంట్ ఎలా చేయాలని ఆలోచిస్తున్న ఈ సోషల్ మీడియా యుగంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రావడం సాధారణ విషయం కాదు. సోషల్ మీడియా యాప్స్ మారుతుంటాయి కానీ ప్రేమ మారదు. ఈ సినిమా జెన్యూన్‌గా చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. హార్ట్ టచింగ్‌గా ఉంటుంది’ అన్నారు.
ప్రీమియర్‌లు వేయండి: అడివి శేష్ సలహా
‘రాజు వెడ్స్ రాంబాయి’పై అంచనాలు
మొత్తంగా, అడివి శేష్ ప్రశంసలు ‘రాజు వెడ్స్ రాంబాయి’పై ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచాయి. ఈ సినిమా సక్సెస్ ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది తెలుగు సినీ ప్రియులకు మంచి అనుభూతినిస్తుందని ఆశిద్దాం.


