|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీ వాయిదా! అసలు కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్!

Published: 04-02-2026, 2:05 AM
షాకింగ్: అడివి శేష్ 'డెకాయిట్' మూవీ వాయిదా! అసలు కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్!
  • అఖండ-2 దెబ్బకు వెనక్కి తగ్గిన ‘డెకాయిట్’ మూవీ: రిలీజ్ డేట్ వాయిదా!
  • అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్: షానీల్ డియో దర్శకత్వం!
  • బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ‘దురంధర్-2’తో పోటీ అందుకే ఈ నిర్ణయం!
  • కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ 10, 2026గా ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్!

టాలీవుడ్ లో ఇప్పుడు వాయిదాల ట్రెండ్ నడుస్తోంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘డెకాయిట్’ మూవీ కూడా వాయిదా పడింది. దీనికి గల కారణాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

‘డెకాయిట్’ మూవీ వాయిదా.. కారణం ఇదేనా?

ఒకప్పుడు ఒక సినిమా వాయిదా పడింది అంటే అది అపశకునం అని ఫీల్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు అది ఒక ట్రెండ్ గా మారిపోయింది. మేకర్స్ చెప్పిన టైమ్ కి సినిమా రిలీజ్ అయితే అదే విశేషం. అయితే కొన్ని సినిమాలు షూటింగ్ కంప్లీట్ కాక వాయిదా పడుతుంటే మరికొన్ని ఆ టైమ్‌లో స్టార్ హీరోస్ సినిమాలు రిలీజ్‌లు ఉన్నాయని వాయిదా వేస్తున్నారు. అలా అఖండ-2 మూవీ రిలీజ్ సమయంలో చాలా చిన్న చిన్న సినిమాలు వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా సీక్వెల్ రిలీజ్ కానున్న టైమ్‌లో డెకాయిట్ (Dacoit) మూవీ కూడా తమ సినిమాను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

అడివి శేష్, మృణాల్ కెమిస్ట్రీ మిస్ అవుతున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరో అడివి శేష్ (Adivi Sesh), యంగ్ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్‌’ (Dacoit). ఈ మూవీకు షానీల్‌ డియో(Shanil Deo) దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాతోనే అతను ఇండస్ట్రీకి పరిచయం కానుండటం విశేషం. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda) నిర్మిస్తుంది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్(Anurag Kashyap) కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌, టీజర్‌మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్నాయి. అయితే ఈ చిత్రం మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు.

ఏప్రిల్ 2026లో ‘డెకాయిట్’ రిలీజ్!

అయితే అదే సమయంలో బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ రణవీర్ సింగ్ నటించిన ‘దురంధర్-2’తో పాటు కన్నడ రాకింగ్ స్టార్ యష్(Yash) నటిస్తున్న ‘టాక్సిక్’(Toxic) చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ నెలకొంది. ఈ భారీ చిత్రాల మధ్య థియేటర్ల లభ్యత, కలెక్షన్ల పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ‘డెకాయిట్’ చిత్రాన్ని ఏప్రిల్ 10, 2026కి వాయిదా వేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ ఈ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని టాక్. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘డెకాయిట్’ మూవీ కొత్త రిలీజ్ డేట్ గురించి త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.