|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాజల్‌తో అడివి శేష్ రొమాన్స్ మిస్: ఆ దర్శకుడు నో చెప్పడానికి కారణం ఇదేనా?

Published: 09-04-2026, 3:05 AM
కాజల్‌తో అడివి శేష్ రొమాన్స్ మిస్: ఆ దర్శకుడు నో చెప్పడానికి కారణం ఇదేనా?
  • అడివి శేష్‌కు మొదట కృష్ణవంశీ ‘చందమామ’ సినిమాలో అవకాశం వచ్చింది.
  • నటన నచ్చకపోవడంతో నవదీప్‌ను తీసుకున్నారు.
  • కాజల్ అగర్వాల్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు అడివి శేష్ ఫీల్ అవుతున్నారు.
  • ‘చందమామ’ సినిమా కాజల్‌కు మంచి గుర్తింపు తెచ్చింది.

యంగ్ హీరో అడివి శేష్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ సినిమాలో మొదట ఆయనకు అవకాశం వచ్చిందట. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.

అడివి శేష్‌కు వచ్చిన అవకాశం

Adivi sesh:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అడివి శేష్ (Adivi shesh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటనతో హ్యాండ్సమ్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈయన.. తాజాగా నటిస్తున్న చిత్రం డెకాయిట్. షానీల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అడివి శేష్ కి జోడీగా, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అవ్వగా.. అంచనాలు పెంచేసింది. మరోవైపు హీరో అడివి శేష్ ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటూ సినిమా గురించి తన కెరియర్ గురించి ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు అందులో భాగంగానే.. కాజల్ తో రొమాన్స్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లు తెలిపారు.

అడివి శేష్ మాట్లాడుతూ.. “కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో నవదీప్ పాత్రకు మొదట కృష్ణవంశీ నన్నే ఎంపిక చేశారు. అయితే నా నటన ఆయనకు అంత సంతృప్తిగా అనిపించలేదు. కొన్ని రోజులకు నన్ను ఆ సినిమా నుండి తీసేసి నా పాత్రలో మళ్ళీ నవదీప్ ను తీసుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమాకి మొదట ‘మల్లెపువ్వు’ అని టైటిల్ పెట్టారు. కానీ కొన్ని రోజులు షూటింగ్ తర్వాత ‘చందమామ’గా మార్చడం జరిగింది” అంటూ అసలు విషయం బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు అడివి శేష్.

కృష్ణవంశీ అసంతృప్తి వెనుక కారణం

ఇకపోతే చందమామ అలియాస్ కాజల్ పక్కన నటించే గొప్ప అవకాశాన్ని అడివి శేష్ కోల్పోవడంతో కాజల్ పక్కన, అందులోనూ అలాంటి పాటలు .. అడివి శేష్ అన్న మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే నటనతో మెప్పించలేక ఆ ఛాన్స్ కోల్పోయానని నిజాయితీగా ఒప్పుకోవడంతో ఆయన వ్యక్తిత్వానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు

చందమామ సినిమా విషయానికి వస్తే.. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో నవదీప్ – కాజల్ జంటగా నటించగా.. శివబాలాజీ – సింధు మీనన్ జంటగా నటించారు . కాజల్ అగర్వాల్ ఈ సినిమాతో చందమామగా ముద్ర వేయించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ మరో సినిమా అందించలేదనే చెప్పాలి.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అటు వరుసగా అవకాశాలు లభించాయి. రాధాకృష్ణ అందించిన మ్యూజిక్ బీట్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి కల్ట్ క్లాసిక్ గా నిలిచింది ఈ సినిమా.

కాజల్ కెరీర్‌కు ‘చందమామ’ ఎంత ఉపయోగపడింది?

అడివి శేష్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి వసూళ్లు సాధించే నటులలో ఒకరిగా పేరు దక్కించుకున్న అడివి శేష్ తన కథల ఎంపిక. రచనా నైపుణ్యాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే డెకాయిట్ తర్వాత ఆయన నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం గూఢచారి 2 . ఆయన అభిమానులే కాదు ఇప్పుడు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి అడివి శేష్ నిజాయితీగా తన అనుభవాన్ని పంచుకోవడంతో అభిమానులు ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటున్నారు. కాజల్ కెరీర్లో ‘చందమామ’ ఒక మైలురాయిగా నిలిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.