|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అడివి శేష్, లిటిల్ హార్ట్ డైరెక్టర్ కలిస్తే విధ్వంసమే! సాయి మార్తాండ్ సంచలన ప్రకటన!

Published: 07-04-2026, 11:05 PM
అడివి శేష్, లిటిల్ హార్ట్ డైరెక్టర్ కలిస్తే విధ్వంసమే! సాయి మార్తాండ్ సంచలన ప్రకటన!
  • డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సాయి మార్తాండ్.
  • క్షణం సినిమా చూసి అడివి శేష్ పై ప్రశంసలు కురిపించిన సాయి మార్తాండ్.
  • గుడాచారి 2 తరువాత శేష్ తో సినిమా ఉంటుందని తెలిపిన సాయి మార్తాండ్.
  • త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా రాబోతోంది.

అడివి శేష్ హీరోగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో సినిమా రాబోతుంది. డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి మార్తాండ్ ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఒక లవ్ స్టోరీ సినిమా తెరకెక్కనుంది.

డెకాయిట్ ప్రీ రిలీజ్ వేడుకలో సాయి మార్తాండ్

Dacoit Pre Release: అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం డెకాయిట్(Dacoit). సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో షానిల్ డియో దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు. ఈ సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నేడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టాలీవుడ్ దర్శకులతో పాటు నిర్మాతలు కూడా హాజరై సందడి చేశారు. విక్టరీ వెంకటేష్ సురేష్ బాబు తో పాటు అక్కినేని హీరోలు కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి పలువురు డైరెక్టర్లు కూడా హాజరయ్యారు . ఇందులో లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ(Sai Marthanda) కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయి మార్తాండ వేదికపై మాట్లాడుతూ తాను క్షణం సినిమా చూసి ఆశ్చర్యపోయానని ఒక కోటి రూపాయలలో ఇలాంటి అద్భుతమైన థ్రిల్లర్ సినిమా ఎలా చేశారు అంటూ ఆశ్చర్యపోయాననీ తెలిపారు. ఇలా ఎప్పుడు విభిన్నమైన కాన్సెప్ట్ తోనే శేష్ అన్న సినిమాలో ఉంటున్నాయి లవ్ స్టోరీ సినిమా చేయరా అనే ఆలోచన నాకు ఉండేది కానీ మొత్తానికి డెకాయిట్ సినిమా యాక్షన్ మాత్రమే కాదు లవ్ స్టోరీ కూడా ఉందని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యానని సాయి మార్తాండ తెలిపారు.

శేష్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

ఇక త్వరలోనే మరొక లవ్ స్టోరీ సినిమా కూడా చేయాలని ఖచ్చితంగా ఆ సినిమా కూడా సక్సెస్ అవుతోంది అంటూ సాయి మార్తాండ గూడచారి 2 తరువాత శేష్ తో సినిమా ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే సాయి మార్తాండ్ శేష్ తో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ జోనర్ లో సినిమా రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

లిటిల్ హార్ట్స్ సినిమాతో సక్సెస్…

లవ్ స్టోరీతో రానున్న అడివి శేష్, సాయి మార్తాండ్

ఇక సాయి మార్తాండ్ కు ఇది రెండవ సినిమా కావటం విశేషం. లిటిల్ హార్ట్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న సాయి తన తదుపరి సినిమా ఏకంగా శేష్ తో చేసే అవకాశం అందుకోవటం విశేషం. మరి ఈ సినిమా నిర్మాతలు ఎవరు? హీరోయిన్ గా ఎవరు ఎంపిక కాబోతున్నారు ఇందులో నటీనటుల వివరాలు తెలియాలి అంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ప్రస్తుతం శేష్ గూడచారి 2 పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా అనంతరమే వీరి కాంబోలో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

మొత్తానికి అడివి శేష్, సాయి మార్తాండ్ ల కాంబినేషన్ ఫిక్స్ అయింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సాయి మార్తాండ్, ఇప్పుడు శేష్ తో ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.