|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ పాట అంటే ఒక వైబ్.. అందుకే ‘డెకాయిట్’మూవీలో పెట్టాం: అడివి శేష్

Published: 06-01-2026, 8:00 AM
ఆ పాట అంటే ఒక వైబ్.. అందుకే ‘డెకాయిట్’మూవీలో పెట్టాం: అడివి శేష్
  • అడివి శేష్ ‘డెకాయిట్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
  • 90వ దశకంలోని ప్రసిద్ధ హిందీ పాట ‘తూ చీజ్ బడి హై మస్త్ మస్త్’ను సినిమాలో ఉపయోగించారు.
  • చిన్ననాటి జ్ఞాపకాలతో ఈ పాట తనకు ప్రత్యేకమైన ‘వైబ్’ అని అడివి శేష్ తెలిపారు.
  • మృణాల్ ఠాకూర్ హీరోయిన్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో; ఉగాదికి మార్చి 19న విడుదల.

టాలీవుడ్ హీరో అడివి శేష్ తన రాబోయే సినిమా ‘డెకాయిట్’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో 90వ దశకంలో దేశాన్ని ఊపేసిన ‘తూ చీజ్ బడి హై మస్త్ మస్త్’ అనే హిందీ పాటను వాడినట్లు వెల్లడించారు. ఈ పాటతో తనకున్న ఎమోషనల్ కనెక్షనే కారణమని తెలిపారు. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

90s పాట ఎంపిక: అడివి శేష్ ఎమోషనల్ కనెక్షన్

టాలీవుడ్ వెర్సటైల్ హీరో అడివి శేష్(Adivi Sesh) గూఢచారి, మేజర్ వంటి సినిమాలతో సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలో అడివి శేష్ ‘డెకాయిట్’ (Dacoit)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ హిందీ పాటను పెట్టినట్లు అడివి శేష్ వెల్లడించాడు. 90వ దశకంలో దేశాన్ని ఊపేసిన హిందీ పాట ‘‘తూ చీజ్ బడి హై మస్త్ మస్త్’’ సాంగ్ అంటే ఇష్టంతో ఆ పాట హక్కులు కొనుగోలు చేసి మరీ ఉపయోగించారట. ఈ విషయంపై అడివి శేష్ స్పందిస్తూ.. ‘‘కొన్ని పాటలు ఎన్నేళ్లు అయినప్పటికీ మనతో పాటే ఉండిపోతాయి. 90sలో పెరిగిన మాకు ఈ పాట అంటే ఒక వైబ్. నిజానికి నేను స్కూల్ స్టేజ్‌పై చేసిన మొట్టమొదటి డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ ఈ పాటకే చేశాను. ఆ జ్ఞాపకం నాకింకా గుర్తుంది.

అందుకే సినిమా డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే.. ఈ పాటను కేవలం ఒక గిమ్మిక్కులా కాకుండా.. ఒక ఎమోషనల్ లాగా ఉపయోగించాలని అనుకున్నాం. చిన్నప్పుడు మ్యూజిక్, ఎంటర్‌టైన్మెంట్‌ని ప్రేమించిన ఆ కుర్రాడికి నేను ఇచ్చే గౌరవం ఇదే’’ అని అన్నారు. కాగా.. ‘డెకాయిట్’ విషయానికొస్తే.. ఈ సినిమాలో అడివి శేష్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)హీరోయిన్‌గా నటిస్తోంది. షానిల్ డియో దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 19న ఉగాది పండుగ కానుకగా.. హిందీ, తెలుగు భాషల్లో విడుదల కాబోతుంది.

డెకాయిట్ స్టార్ కాస్ట్, నిర్మాణ వివరాలు

ఉగాది కానుకగా ‘డెకాయిట్’ విడుదల

అడివి శేష్ చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడిన ఈ పాట ‘డెకాయిట్’కు మరింత వైబ్‌ను తీసుకురావడం ఖాయం. శేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా ఉగాది పండుగ కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.