|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఇచ్చిన మాట కోసం బాలీవుడ్ ఆఫర్స్ వదులుకున్న అడివి శేష్!

Published: 06-04-2026, 9:05 AM
షాకింగ్: ఇచ్చిన మాట కోసం బాలీవుడ్ ఆఫర్స్ వదులుకున్న అడివి శేష్!
  • మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులకు అడివి శేష్ ఇచ్చిన మాట!
  • వరుస ఆఫర్లను వదులుకుంటున్న అడివి శేష్ నిర్ణయం సంచలనం!
  • డెకాయిట్ మూవీ ప్రమోషన్స్‌లో అడివి శేష్ బిజీ!
  • బాలీవుడ్‌లో ఆరు సినిమాలను రిజెక్ట్ చేసిన అడివి శేష్!

టాలీవుడ్ సెన్సేషన్ అడివి శేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. మేజర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్లను వదులుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగింది?

మేజర్ సినిమాతో బాలీవుడ్‌లో క్రేజ్

Adivi Sesh : మొదటి సినిమా నుంచి వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు అడివి శేష్. వరుసగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో వచ్చిన అడివి శేష్ ఇప్పుడు లవ్ యాక్షన్ సినిమా డెకాయిట్ తో రాబోతున్నాడు. డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ప్రస్తుతం శేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

అయితే అడివి శేష్ కి మేజర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి ఫేమ్ వచ్చింది. మేజర్ సినిమా బాలీవుడ్ లో కూడా హిట్ అయి అక్కడ కూడా శేష్ కి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు డెకాయిట్ సినిమా కూడా బాలీవుడ్ లో భారీగానే రిలీజ్ చేస్తున్నారు. నేడు అడివి శేష్ మీడియాతో మాట్లాడగా మేజర్ తర్వాత బాలీవుడ్ లో మీకు ఫేమ్ వచ్చింది కదా అక్కడ నుంచి ఆఫర్స్ వచ్చాయా అని మీడియా ప్రతినిధి అడిగారు.

తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ఇదే!

దీనికి అడివి శేష్ సమాధానమిస్తూ.. బాలీవుడ్ లో దాదాపు ఆరు సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. అందులో రెండు బయోపిక్స్, నాలుగు వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు. అయితే నేను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ కి మాట ఇచ్చాను. ఆ సినిమా ప్యాషన్ తో తీస్తాను, కమర్షియల్ గా కాదు. ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలు చేయను అని. వాళ్లకు ఇచ్చిన మాట ప్రకారం నేను వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఒప్పుకోవట్లేదు. నేను డబ్బుల కోసం సినిమాలు చేస్తే నైతికంగా కరెక్ట్ కాదు. అందుకే నేను ఆ సినిమాలకు నో చెప్పాను. అలాగే బయోపిక్స్ కూడా ఆ కథలు నాకు ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. బయోపిక్స్ అంటే లైఫ్ లో అప్ & డౌన్స్ ఉండాలి. కానీ వాళ్ళు చెప్పిన కథలో హీరో ఎదుగుతూనే ఉంటాడు. అందుకే ఆ కథలకు నో చెప్పాను. నాకు నచ్చే పర్ఫెక్ట్ కథ వస్తే కచ్చితంగా బాలీవుడ్ లో చేస్తాను అని తెలిపాడు.

డబ్బు కోసం సినిమాలు చేయను: శేష్

మేజర్ సినిమా ముంబై ఉగ్రదాడుల్లో మరణించిన ఆర్మీ అధికారి సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. అతని కథని సినిమాగా తీయడానికి చాలా మంది ప్రయత్నించారు. కానీ సందీప్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. అడివి శేష్ ఇచ్చిన మాట వల్లే వాళ్ళు ఒప్పుకొని మేజర్ సినిమాకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో అడివి శేష్ సందీప్ పేరెంట్స్ కి మరింత దగ్గరయి ఓ ఫ్యామిలీలా వాళ్ళతో కలిసిపోయాడు. వాళ్లకు ఇచ్చిన మాట కోసం శేష్ వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఇకపై చేయడు అని తెలుస్తుంది.

అడివి శేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.