
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కోసం డైరెక్ట్ ఆడిషన్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో జరగనున్న ఈ ఆడిషన్స్ లో పాల్గొని మీ గాయక ప్రతిభను ప్రదర్శించండి. గీతామాధురి, తమన్, కార్తీక్ వంటి ప్రముఖులు గెస్టులుగా ఉంటారు.
Key Points
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 డైరెక్ట్ ఆడిషన్స్!
ఆగస్ట్ 3న హైదరాబాద్ లో గ్రౌండ్ ఆడిషన్స్!
మీ గాయక ప్రతిభను ప్రదర్శించి ఆహాలో అవకాశం సొంతం చేసుకోండి!
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4
Telugu Indian Idol : తెలుగు ఓటీటీ ఆహాలో కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయాడానికి సాంగ్స్, డ్యాన్స్ షోలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తిచేసుకోగా త్వరలో నాలుగో సీజన్ మొదలు కానుంది.
ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షోతో ఎంతోమంది లోకల్ సింగర్స్ ని పరిచయం చేసారు. తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కి గత కొన్ని రోజులుగా ఆన్లైన్ లో ఆడిషన్స్ అవ్వగా ఇప్పుడు ఆఫ్ లైన్ లో ఆడిషన్స్ జరగనున్నాయి.
డైరెక్ట్ ఆడిషన్ వివరాలు
హైదరాబాద్ లోని JNTUH మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రిషి ఎమ్.ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్ట్ 3న గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహించనున్నారు. ఈసారి కూడా షోలో గీతామాధురి, తమన్, కార్తీక్ లు గెస్టులుగా ఉండబోతున్నారు. మీరు కూడా సింగర్ అవ్వాలనుకుంటే ఈ ఆడిషన్స్ కి వెళ్లి ఆహా షోలో పాడే ఛాన్స్ కొట్టేయండి.
ఎలా పాల్గొనాలి?
మీరు ఒక ప్రతిభావంతులైన గాయకుడైతే, ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో మీ ప్రతిభను చూపించి, విజయం సాధించండి!


