
📌 Key Points
- న్యాయవాద వృత్తిలో AI సాంకేతికత వేగంగా విస్తరిస్తోంది.
- AI టూల్స్ ద్వారా చట్టపరమైన పరిశోధన సులభతరం అవుతోంది.
- జూనియర్ న్యాయవాదుల అవసరం తగ్గుతుందనే ఆందోళనలు ఉన్నాయి.
- సామాన్యులకు చట్టపరమైన సలహాలు AI ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి.
ప్రస్తుతం అన్ని రంగాల్లో AI తన సత్తా చాటుతోంది. న్యాయవాద వృత్తిలో కూడా AI పెను మార్పులు తీసుకువస్తోంది. వేగంగా డాక్యుమెంట్లు చదవడానికి, పరిశోధన చేయడానికి AI ఉపయోగపడుతుంది.
AIతో న్యాయవాద వృత్తిలో మార్పులు
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సత్తా చాటుతోంది. తాజాగా అత్యంత సంక్లిష్టమైన న్యాయవాద వృత్తిని (Legal Profession) కూడా ఆ టెక్నాలజీ షేక్ చేస్తోంది. ఒకప్పుడు వేల పేజీల డాక్యుమెంట్లు చదవడానికి, గత తీర్పులను పరిశోధించడానికి లాయర్లకు రోజులు పట్టేది. కానీ, ఇప్పుడు ‘AI’ ఆ పనిని కేవలం సెకన్లలోనే పూర్తి చేస్తోంది. దీంతో న్యాయ వ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయి. సాధారణంగా న్యాయవాద వృత్తిలో రాణించాలంటే దశాబ్దాల అనుభవం, చట్టాలపై అపారమైన పట్టు ఉండాలి. అయితే, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన చాట్ జీపీటీ (ChatGPT), హార్వే ఏఐ (Harvey AI) వంటి టూల్స్ వల్ల సామాన్య న్యాయవాదులు కూడా సీనియర్ల స్థాయిలో చట్టపరమైన పరిశోధన చేయగలుగుతున్నారు. దీంతో వృత్తిపరమైన అడ్డంకులు (Barriers) తగ్గుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
జూనియర్ లాయర్లకు అవకాశాలు తగ్గుతున్నాయా?
సాధారణంగా లా ఫామ్స్‌లో జూనియర్ న్యాయవాదులు చేసే ప్రధాన పని.. కేసులకు సంబంధించిన పాత తీర్పులను వెతకడం, డాక్యుమెంట్లను సరిచూడడమే. కానీ, ఇప్పుడు ఆ పనులన్నీ ఏఐ చేస్తుండటంతో జూనియర్ల అవసరం తగ్గుతోంది. దీంతో భవిష్యత్తులో కొత్తగా వృత్తిలోకి వచ్చే వారికి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు అభిప్రయాపడుతున్నారు. న్యాయవాదులు సాధారణంగా తాము పని చేసే గంటల ప్రకారం (Billable Hours) క్లయింట్ల నుంచి ఫీజు వసూలు చేస్తారు. రోజుల తరబడి పట్టే పనిని ఏఐ గంటల్లోనే పూర్తి చేస్తుంటే.. క్లయింట్లు ఎక్కువ ఫీజు చెల్లించడానికి సాహసించడం లేదు. ఇది న్యాయ సంస్థల ఆదాయంపై భారీగా ప్రభావం చూపుతోంది.
సామాన్యులకు AIతో న్యాయ సహాయం
కొన్నిసార్లు ఏఐ లేని కేసులను ఉన్నట్లుగా చూపిస్తుంది. దీంవల్ల కోర్టుల్లో తప్పుడు ఆధారాలు సమర్పించే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదులు ఏఐపై అతిగా ఆధారపడితే వృత్తిపరమైన నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇక మరోవైపు, ఏఐ వల్ల సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఖరీదైన లాయర్లను సంప్రదించలేని వారు, ఏఐ సహాయంతో తమ కేసులకు సంబంధించిన ప్రాథమిక చట్టపరమైన సలహాలను సులభంగా పొందతున్నారు. న్యాయవాద వృత్తిని AI పూర్తిగా భర్తీ చేయలేదు కానీ, ఏఐని ఉపయోగించుకోవడం తెలిసిన న్యాయవాదులు మాత్రమే భవిష్యత్తులో పోటీని తట్టుకోగలరు. కేవలం ఇతర కేసుల జడ్జిమెంట్‌లను సేకరించడమే కాకుండా, పక్కా ప్లానింగ్‌తో క్లిష్టమైన కేసుల వాదనల్లో ఏఐ టెక్నాలజీ తోడ్పడనుంది.
AI న్యాయవాద వృత్తిని పూర్తిగా భర్తీ చేయనప్పటికీ, దీనిని ఉపయోగించుకునే న్యాయవాదులు భవిష్యత్తులో రాణిస్తారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం.


