
📌 Key Points
- జెన్ Z యువత కెరీర్‌ను నిచ్చెనలా కాకుండా అన్వేషణగా భావిస్తోంది.
- జిగ్‌జాగ్ కెరీర్ విధానం వ్యక్తిని బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దుతుంది.
- AI యుగంలో అడాప్టబిలిటీ అనేది ఉద్యోగ భద్రతకు అసలైన ఆయుధం.
- కంపెనీలు డిగ్రీలతో పాటు వేగంగా నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి.
ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో జెన్ Z యువత కెరీర్ పట్ల సరికొత్త విధానాన్ని అవలంభిస్తోంది. ఒకే ఉద్యోగానికి పరిమితం కాకుండా, వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ‘జిగ్‌జాగ్ కెరీర్’ బాటలో పయనిస్తున్నారు.
స్టెబిలిటీ నుంచి సాహసం వైపు
ప్రస్తుతం వేగంగా మారుతున్న ప్రపంచంలో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ విప్లవం రాజ్యమేలుతున్న కాలంలో “జిగ్‌జాగ్ కెరీర్” (Zigzag Career) అనేది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, అది ఒక మనుగడ మంత్రం. ఒకప్పుడు ఒకే కంపెనీలో దశాబ్దాల పాటు పని చేయడం స్థిరత్వంగాను, భద్రతగాను భావించేవారు. కానీ నేడు అది జఢత్వంగా భావిస్తున్నారు. జెన్ జెడ్ (Gen Z) యువత ఈ విషయాన్ని ముందే పసిగట్టి, కెరీర్ అంటే నిచ్చెనగా కాకుండా, కెరీర్ అంటే ఒక అద్భుతమైన అన్వేషణగా మార్చకుంటున్నారు. ఈ కొత్త పని సంస్కృతి ఒక వ్యక్తిని కేవలం ఒక ఉద్యోగిగా కాకుండా, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దటానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
స్టెబిలిటీ నుంచి సాహసం వైపు
గతంలో కెరీర్ అంటే ఒక నిర్దేశిత మార్గం. ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్‌గా, వైద్యం చదివితే డాక్టర్‌గా రిటైర్ అవ్వడమే లక్ష్యంగా ఉండేది. కానీ నేడు “జిగ్‌జాగ్ కెరీర్” ఆ మూస పద్ధతులను బద్దలు కొడుతోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. ఒక వ్యక్తి తన కెరీర్ ప్రయాణంలో వివిధ రంగాలపై అవగాహన కలిగి ఉండటం. ఉదాహరణకు ఒక అకౌంటెంట్ తన విశ్లేషణాత్మక నైపుణ్యాలను ఉపయోగించి డేటా సైన్స్ వైపు వెళ్లడం, ఒక గ్రాఫిక్ డిజైనర్ కస్టమర్ సైకాలజీ నేర్చుకుని మార్కెటింగ్ హెడ్‌గా ఎదగడం.. ఇలా విభిన్న రంగాల్లో అడుగుపెట్టడం వల్ల వ్యక్తికి ప్రపంచంపై ఉన్న అవగాహన పెరుగుతుంది. అయితే ఇది కేవలం జీతం పెంచుకోవడానికి చేసే ప్రయత్నం కాదు. ఇది జ్ఞానాన్ని పెంచుకోవడానికి సాగే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు ఒక వ్యక్తిని మానసికంగా మరింత దృఢంగా మారుస్తాయి.
AI యుగంలో అడాప్టబిలిటీయే అసలైన ఆయుధం
AI యుగంలో అడాప్టబిలిటీయే ఆయుధం
మనం ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఉన్నాం. AI వల్ల, ఆటోమేషన్ వల్ల రేపు ఏ ఉద్యోగం ఉంటుందో, ఏది ఊడుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో “నేను ఈ ఒక్క పని మాత్రమే చేస్తాను” అని మొండిగా ఉండటం రిస్క్ తీసుకోవడమే అవుతుంది. జిగ్‌జాగ్ కెరీర్ అనుసరించే వారు ఏ ఒక్క రంగానికో పరిమితం కాకపోవడం వల్ల, ఒక రంగంలో అవకాశాలు తగ్గినా వెంటనే తమ నైపుణ్యాలను మరో రంగంలోకి మళ్లించి రాణించగలరు. ఈ అడాప్టబిలిటీ (Adaptability) వారిని నిరుద్యోగ భయం నుండి కాపాడుతుంది. కంపెనీలు కూడా ఇప్పుడు కేవలం డిగ్రీలను మాత్రమే చూడటం లేదు. ఒక వ్యక్తి క్లిష్ట పరిస్థితుల్లో ఎంత వేగంగా కొత్త విషయాలు నేర్చుకోగలడు (Learning Agility) అనే అంశానికే పెద్దపీట వేస్తున్నాయి.
జిగ్‌జాగ్ కెరీర్ వల్ల కలిగే అతిపెద్ద లాభం “స్కిల్ హైబ్రిడైజేషన్”. వివిధ రంగాల్లో పని చేయడం వల్ల ఒక “స్విస్ ఆర్మీ నైఫ్” లాగా తయారవుతారు. అంటే ఏ సమస్యకైనా అన్ని కోణాల్లో పరిష్కారం చూపగల సామర్థ్యం ఉంటుంది. ఒక రంగంలో నేర్చుకున్న క్రమశిక్షణ, మరొక చోట నేర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకొక చోట నేర్చుకున్న మేనేజ్‌మెంట్ పద్ధతులు అన్నీ కలిసి ఒక పరిపూర్ణమైన వృత్తి నిపుణుడిగా తీర్చిదిద్దుతాయి. ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కు మార్కెటింగ్ మెళకువలు తెలిస్తే, అతను వినియోగదారులకు నచ్చే ఉత్పత్తులను మరింత సక్సెస్ ఫుల్ గా క్రియేట్ చేయగలడు. భవిష్యత్తులో కేవలం ఒకే రంగంలో ఎక్స్పర్ట్స్ అయిన వారి కంటే, అనేక పనుల మీద అవగాహన ఉండి, వాటిని సమన్వయం చేయగల వారికే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
జెన్ జెడ్ – గిగ్ ఎకానమీ విప్లవం
కంపెనీల అంచనాలు మారుతున్న తీరు
జెన్ జెడ్ (Gen Z) యువత ఈ జిగ్‌జాగ్ ట్రెండ్‌ను ఒక శక్తిగా మార్చుకుంటున్నారు. వీరికి ఒకే ఆఫీసులో కూర్చుని 9 నుండి 5 వరకు పని చేసే సంప్రదాయం నచ్చడం లేదు. గిగ్ ఎకానమీ (Gig Economy), ఫ్రీలాన్సింగ్ పద్ధతుల వల్ల వీరు ఒకే సమయంలో రెండు, మూడు వేర్వేరు ప్రాజెక్టులపై పని చేస్తున్నారు. దీనివల్ల సహజంగానే వీరి అనుభవం ఒకే లైన్‌లో కాకుండా జిగ్‌జాగ్ పద్ధతిలో సాగుతుంది. వీరు లెర్నింగ్‌కు ఇచ్చే ప్రాధాన్యత స్టెబిలిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక కంపెనీలో నేర్చుకోవడానికి ఇంకేమీ లేదనిపిస్తే, వారు వెంటనే మరో కొత్త రంగానికి మారిపోవడానికి వెనకాడటం లేదు. ఈ రిస్క్ తీసుకునే గుణమే వారిని “ఫ్యూచర్-రెడీ”గా ఉంచుతోంది. కోవిడ్ తర్వాత ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని అందరికీ అర్థమైంది, ఆ అవగాహనే జెన్ జెడ్‌ను మరింత అప్రమత్తంగా ఉంచుతోంది.
జీవితం నిచ్చెన కాదు.. సాహస యాత్ర
జిగ్‌జాగ్ కెరీర్ అనేది ఒక కెరీర్ అస్థిరత అని కాదు, అది ఒక అపారమైన ఆత్మవిశ్వాసానికి, రెడీ ఫర్ ఎవ్రీథింగ్ కు గుర్తు. “నేను ఎక్కడైనా, ఏ పనినైనా నేర్చుకుని రాణించగలను” అనే నమ్మకమే ఈ తరాన్ని గ్లోబల్ లీడర్స్‌గా మారుస్తోంది. మారుతున్న కాలంలో కొత్త విషయాలు నేర్చుకోవడం ఎలా అనే వైవిధ్యమైన కోర్సు కూడా పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు వృత్తి నిపుణులు. కెరీర్ అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగే సరళరేఖ కాదు. అది జిగ్ జాగ్ లతో కూడిన అందమైన ప్రయాణం. ఆ మలుపులను ఎవరైతే త్వరగా అర్థం చేసుకొని దాటుతారో వారే రేపటి ప్రపంచాన్ని ఏలుతారు అని స్పష్టం చేస్తున్నారు.
కాబట్టి, జెన్ Z ఉద్యోగాల పట్ల వినూత్నంగా ఆలోచిస్తూ, తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి అవసరమైన మార్పులకు అనుగుణంగా సిద్ధమవుతోంది. ఇది మిగతా వారికి కూడా ఒక స్ఫూర్తిదాయకం.


