
స్టార్ హీరో ధనుష్ మరియు ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వారి కుమారుడు యాత్ర రాజా స్కూల్ గ్రాడ్యుయేషన్‌కు ఇద్దరూ కలిసి హాజరయ్యారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Key Points
ధనుష్ మరియు ఐశ్వర్య రజినీకాంత్‌ల కుమారుడు యాత్ర రాజా స్కూల్ గ్రాడ్యుయేషన్.
ఈ కార్యక్రమంలో ధనుష్ మరియు ఐశ్వర్య కలిసి పాల్గొన్నారు.
ఇద్దరూ కలిసి తమ కొడుకును హగ్ చేసుకుని ఫోటో దిగారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యాత్ర రాజా గ్రాడ్యుయేషన్
స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో రజినీకాంత్ అల్లుడుగానే కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ధనుష్. అయితే అలాంటి హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకొని ఇద్దరు విడివిడి గానే ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత విడిపోయింది.
ఇక తన భార్యకు విడాకులు ఇచ్చిన ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు ఈ మధ్య విపరీతంగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో… తాజాగా తన భార్యతో కలిసి మెరిసాడు హీరో ధనుష్. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. హీరో ధనుష్ – ఐశ్వర్య కుమారుడు యాత్ర రాజా స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా… నిర్వహించిన కార్యక్రమంలో ఐశ్వర్య అలాగే హీరో ధనుష్ ఇద్దరు కలిసి పాల్గొన్నారు.
ధనుష్ మరియు ఐశ్వర్య కలిసి
ఈ తరుణంలో తమ కొడుకును ఇద్దరు హగ్ చేసుకుని మరి ఫోటో దిగారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోను సూపర్ రజినీకాంత్ షేర్ చేశారు. తన మనవడికి రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పారు. నా ముద్దుల మనవడా మొదటి మైలురాయి దాటేశావ్… యాత్ర కన్నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నాడు. కాగా ధనుష్, ఐశ్వర్య ఇద్దరు కో పేరెంటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కొడుకు కోసం ఇద్దరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
#Dhanush ❤️ pic.twitter.com/27C8tW9M4i
యాత్ర రాజా గ్రాడ్యుయేషన్ సందర్భంగా ఐశ్వర్య మరియు ధనుష్ కలిసి పాల్గొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారి కొడుకు విజయం కోసం ఇద్దరూ కలిసి ఉండటం అభిమానులను ఆనందపరిచింది.


