
📌 Key Points
- వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది.
- ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.
- మెగాస్టార్ కొత్త సినిమాలో ఐశ్వర్య రాయ్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు.
- ఆమె మెయిన్ హీరోయిన్‌గానా లేదా అతిథి పాత్రలోనా అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ముఖ్య పాత్రలో మెరుస్తుందా లేక అతిథి పాత్రలో కనిపిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఈ సంక్రాంతి కానుకగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో సందడి చేయనున్న మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత దర్శకుడు బాబీతో సినిమా చేయనున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సినిమా రాగా, ఇప్పుడు మరొకటి రానుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా, మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
అయితే ఈ నేపథ్యంలో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో ఐశ్వర్య రాయ్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీలో ఆమెను అతిథి పాత్ర కోసం తీసుకుంటున్నారా? లేక మెయిన్ హీరోయిన్ ఆమెనా? అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ మొత్తానికి అయిత ఐశ్వర్య రాయ్ పేరును మాత్రం ఈ సినిమా కోసం పరిశీలిస్తోందట చిత్ర బృందం. అన్ని ఓకే అయితే త్వరలో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో డాడీ సినిమాలో అతిథి పాత్రలో మెరిశారు ఐశ్వర్య రాయ్.
ఐశ్వర్య రాయ్ పాత్రపై సస్పెన్స్
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
చిరంజీవి సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించడం కచ్చితంగా సినిమాకు మరింత గ్లామర్ తీసుకువస్తుంది. ఆమె పాత్రపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.


