|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్‌తో వివాదంపై అజిత్ కుమార్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

Published: 07-11-2025, 1:02 AM
విజయ్‌తో వివాదంపై అజిత్ కుమార్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, విజయ్ మధ్య వివాదంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన అజిత్, తప్పుడు ప్రచారం జరుగుతోందని తేల్చి చెప్పారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై కూడా ఆయన మాట్లాడారు, అభిమానులను నిందించడం సరికాదన్నారు.

Key Points

1

అజిత్ కుమార్, విజయ్ మధ్య వివాదంపై వస్తున్న పుకార్లను అజిత్ ఖండించారు.

2

విజయ్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు సృష్టించడానికి తన ఇంటర్వ్యూలను వాడుకుంటున్నారని తెలిపారు.

4

కరూర్ అభిమానుల తొక్కిసలాట దురదృష్టకర ప్రమాదమని, అభిమానులను మాత్రమే నిందించడం సరికాదని అన్నారు.

విజయ్‌తో వివాదంపై అజిత్ క్లారిటీ

సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ నుంచి హీరో, హీరోయిన్లకు సంబంధించిన పుకార్లు ఎక్కువయ్యాయి. అయితే దీనిని కొందరు మంచికి ఉపయోగిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడుకు వాడుతూ.. ఏఐ ద్వారా వీడియోలను క్రియేట్ చేసి హీరోయిన్లకు చెడుగా చూపిస్తున్నారు. అలాగే పలు పుకార్లను కూడా సృష్టిస్తూ నెట్టింట వైరల్ చేస్తూ అందరినీ నమ్మిస్తున్నారు. ఇలాంటి ఘటనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు కూడా ఎదురైంది. విజయ్‌తో పలు వివాదం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల ఆయన ఫ్యాన్స్ మీట్ పెట్టగా.. అందులో తొక్కిసలాట జరిగి ఎంతోమంది చనిపోయిన విషయంపై కూడా అజిత్ (Ajith Kumar)మాట్లాడిన మాటలను తప్పుగా ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య గొడవలు ఉండటం వల్లనే అలా చేస్తున్నారని అంటున్నారు.

తప్పుడు ప్రచారంపై అజిత్ ఆగ్రహం

ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజిత్ కుమార్.. విజయ్‌(Vijay)తో వివాదంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘కొంతమంది నా ఇంటర్వ్యూను విజయ్‌కి వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారు. కానీ అది నిజం కాదు. నేను ఎప్పుడూ విజయ్ గురించి మంచిగా ఆలోచిస్తూనే ఉన్నాను. అతనికి శుభాకాంక్షలు తెలిపాను. దళపతి విజయ్‌కి వ్యతిరేకంగా ఉన్నానని తప్పుడు వార్తలు సృష్టించడానికి కొందరు నా ఇంటర్వ్యూలను ఉపయోగించి తప్పుడు వార్తలు రాస్తున్నారు. అయినా విజయ్ మౌనంగా ఉండటం మంచిది. నేను ఎల్లప్పుడూ అతనికి మంచిని మాత్రమే కోరుకుంటున్నాను.

కరూర్ తొక్కిసలాటపై అజిత్ స్పందన

దయచేసి తప్పుడు వార్తలు సృష్టించకండి. కరూర్ తొక్కిసలాట దురదృష్టకర ప్రమాదం. కొన్ని మీడియా సంస్థలు అభిమానులను నిందించడానికి ప్రయత్నిస్తున్నాయి. నా తండ్రి మరణించినప్పుడు, మీడియా మమ్మల్ని అనుసరించి, వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆయన శరీరాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించింది. కాబట్టి, మనం అభిమానులను మాత్రమే నిందించలేము’’ అని చెప్పి పుకార్లకు చెక్ పెట్టారు.

మొత్తంగా, విజయ్‌తో వివాదంపై అజిత్ ఇచ్చిన వివరణ పుకార్లకు తెరదించింది. అజిత్ స్పందన అభిమానులకు స్పష్టతనిచ్చింది, తప్పుడు వార్తలను నమ్మవద్దని సందేశాన్నిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.