|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా రేస్‌ కోరిక.. నాన్న ఇచ్చిన సలహా : అజిత్‌

Published: 21-05-2025, 5:42 AM
నా రేస్‌ కోరిక.. నాన్న ఇచ్చిన సలహా : అజిత్‌

ప్రముఖ నటుడు అజిత్‌ తన జీవితం గురించి, ముఖ్యంగా చిన్నప్పటి నుండి కలిగిన కార్ రేసింగ్ అభిరుచి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అతని తల్లిదండ్రుల ప్రోత్సాహం, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తండ్రి ఇచ్చిన సలహా..

Key Points

1

అజిత్‌కు చిన్నప్పటి నుంచి కార్ రేసులంటే చాలా ఇష్టం.

2

తల్లిదండ్రుల ప్రోత్సాహం అజిత్‌కు ఎంతో ఉపయోగపడింది.

4

చదువు లేదా ఉద్యోగంపై తల్లిదండ్రుల దృష్టి అజిత్‌కు మార్గదర్శకం అయ్యింది.

అజిత్‌కు కార్ రేసులపై ఆసక్తి

స్టార్‌ కథానాయకుడిగా రాణిస్తున్న నటుడు అజిత్‌ జీవన విధానమే ప్రత్యేకం. తనూ, తన కుటుంబం, నటన, తన కారు పందేలు ఇవే ఆయన లోకం. ఇతర విషయాల గురించి పట్టించుకోరు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో జరిగే సంఘటనలపై అస్సలు జోక్యం చేసుకోరు. మొదట్లో తరచూ పత్రికల వారిని కలుసుకునే అజిత్‌ ఆ తర్వాత పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. సినిమా రంగానికి ఇలా చేసిన సేవలుగాను ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న విషయం తెలిసింది. అలాగే కార్‌ రేస్‌లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వం

ఈ సందర్భంగా అజిత్‌ ఇటీవల ఎక్కువగా మీడియాతో ముచ్చటిస్తుండటం విశేషం. అలా ఒక భేటీలో తన కార్‌ రేస్‌ పై ఆసక్తి గురించి పేర్కొంటూ తనకు చిన్నతనం నుంచి కారు రేసులంటే చాలా ఆసక్తి అని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించారన్నారు. ఆ విధంగా తాను చాలా అదృష్టవంతుడిని పేర్కొన్నారు. అయితే అప్పట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తన తండ్రి చాలా నిజాయితీగా ఒక సలహా ఇచ్చారన్నారు. కార్‌ రేస్‌ అనే క్రీడా చాలా ఖర్చుతో కూడిందని, అందువల్ల తాము నీకు తగిన సపోర్టును ఇవ్వలేకపోవచ్చని చెప్పారన్నారు.

ఆర్థిక సవాళ్లు మరియు తండ్రి సలహా

అయితే నువ్వు స్పాన్సర్స్‌ను కనుగొని నీ లక్ష్య సాధనలో ముందుకు సాగాలని చెప్పారన్నారు. అలాగే తాను పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు ఒక విషయంలో మాత్రం చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు. నువ్వు చదువు పూర్తి చేసి పట్టా అందుకోవాలన్నారు. లేదా ఏదైనా ఉద్యోగం చేయాలన్నారు. అంతేకానీ సమయాన్ని మాత్రం వృథా చేయకూడదని సలహా ఇచ్చారన్నారు. అప్పుడే తాను ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నానని నటుడు అజిత్‌ చెప్పారు.

అజిత్‌ జీవితం, అతని కార్ రేసింగ్ అభిరుచి, మరియు తల్లిదండ్రుల మద్దతు, సలహాలకు నిదర్శనం. ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, లక్ష్యం సాధించడానికి అతను ఎంచుకున్న మార్గం ప్రేరణదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.