
📌 Key Points
- ఆకాష్ పూరి హీరోగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.
- సక్సెస్ తర్వాతే తండ్రితో సినిమా చేస్తానని గతంలో ప్రకటించారు.
- త్వరలోనే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా అని ఆకాష్ వెల్లడి.
- రవితేజ నటించిన ‘నేనింతే’ సినిమాని రీమేక్ చేయాలని ఆకాంక్ష.
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి త్వరలో తండ్రి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. రవితేజ నటించిన ‘నేనింతే’ సినిమాను రీమేక్ చేయాలనే తన కోరికను వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికరమైన నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఆకాష్ పూరి సినీ ప్రస్థానం, విజయాల కోసం ఆరాటం
Akash Puri: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ఓవెలుగు వెలిగారు. అప్పట్లో పూరి డైరెక్షన్లో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. అంత అద్భుతంగా ఆయన సినిమాలు ఉండేవి ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో కూడా పూరి జగన్నాథ దర్శకత్వంలో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరి (Akash Puri)నీ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
ఆకాష్ బాలా నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆకాష్ హీరోగా చోర్ బజార్, మహబూబ్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా వచ్చారు. కానీ ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా స్టార్ డైరెక్టర్ వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆకాష్ సక్సెస్ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. అయితే తాను ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అయిన తర్వాతనే తన తండ్రి డైరెక్షన్లో సినిమాలు చేస్తానని గతంలో పలు సందర్భాలలో వెల్లడించారు.
పూరి, ఆకాష్ కాంబో ఎప్పుడు?
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆకాష్ తన తండ్రి పూరి జగన్నాథ్ తో సినిమాలు చేయడం గురించి స్పందించారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ.. నాన్నతో కలిసి సినిమా చేసే సమయం దగ్గర్లో ఉందని, త్వరలోనే నాన్న డైరెక్షన్ లో సినిమా చేస్తానని తెలిపారు. ప్రస్తుతం నాన్న తన సినిమా పనులలో బిజీగా ఉన్నారు. నేను కూడా నా సినిమా పనులలో బిజీగా ఉన్నానని అయితే త్వరలోనే మేమిద్దరం సినిమా చేయబోతున్నామని తెలిపారు. ఒకవేళ తన తండ్రి డైరెక్షన్లో వచ్చిన సినిమాలలో రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమా రీమేక్ చేస్తారనే ప్రశ్న కూడా ఎదురయింది.
ఈ ప్రశ్నకు ఆకాష్ సమాధానం చెబుతూ.. రవితేజ హీరోగా నటించిన నేనింతే (neninthe)సినిమాని కచ్చితంగా రీమేక్ చేస్తానని తెలిపారు. ఈ సినిమా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టమని అందుకే ఈ సినిమానే రీమేక్ చేస్తానని తెలిపారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ ఆకాష్ మాత్రం నేనింతే వంటి డిజాస్టర్ సినిమాను రీమేక్ చేస్తానని చెప్పడంతో ఒకసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. మరి ఈ సినిమా కార్యరూపం ఎప్పుడు దాలుస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు స్లమ్ డాగ్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
“నేనింతే” రీమేక్.. ఎందుకు?
ఆకాష్ పూరి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ పై అంచనాలున్నాయి. డిజాస్టర్ ‘నేనింతే’ను రీమేక్ చేయాలనే ఆకాష్ నిర్ణయం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.


