
📌 Key Points
- మంగ్లీపై 10 కోట్ల రూపాయల మోసం ఆరోపణలు చేసిన అడ్వకేట్ సుబ్బారావు.
- ఆరోపణలు నిరాధారమని, సుబ్బారావు తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారని మంగ్లీ ఆవేదన.
- సుబ్బారావుకు బిగ్ బాస్ వెళ్లాలని ఉందని, అందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ ఆరోపణ.
- సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు వార్తలు వస్తున్నాయని, నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని విజ్ఞప్తి.
సింగర్ మంగ్లీ ఇటీవల వరుస వివాదాల్లో నిలుస్తున్నారు. తాజాగా అడ్వకేట్ సుబ్బారావు ఆమెపై 10 కోట్ల రూపాయల మోసం ఆరోపణలు చేశారు. దీనిపై మంగ్లీ స్పందిస్తూ, ఆ ఆరోపణలు నిరాధారమని ఆమె తెలిపారు.
మంగ్లీపై మోసం ఆరోపణలు చేసిన సుబ్బారావు
Singer Mangli: సింగర్ మంగ్లీ ఇటీవల కాలంలో వరుస వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె 10 కోట్లు రూపాయలు మోసపూరితంగా తీసుకుంది అంటూ అడ్వకేట్ సుబ్బారావు(Advocate Subbarao) తనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై సింగర్ మంగ్లీ(Singer Mangli) ఇప్పటికే స్పందిస్తూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు. అయితే తాజాగా మరోసారి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఈమె మీడియా సమక్షంలో కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు. మంగ్లీ మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ అడ్వకేట్ సుబ్బారావు ఏదైతే తన గురించి ఆరోపణలు చేశారో అది ఏమాత్రం నిజం కాదని తెలిపారు.
అడ్వకేట్ సుబ్బారావుకు సినిమాలు అంటే ఎంతో పిచ్చి. ఆయనకు బిగ్ బాస్ వెళ్లాలని ఉంది. ఆయనకు శ్రీముఖి అంటే క్రష్ బిగ్ బాస్ వెళ్ళాలి అంటే ఫేమస్ కావాలి అందుకోసమే ఎన్నో మీడియా ఛానల్ ను సంప్రదించి ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించారు అది కుదరని నేపథ్యంలో తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలకు పాల్పడ్డారని మంగ్లీ తెలిపారు. సుబ్బారావు చేసిన ఆరోపణలలో నిజం ఉందని తేలితే నేను ఏం చేయడానికైనా సిద్ధమే ఇందుకోసం తాను ఏ పోలీస్ స్టేషన్ కైనా వస్తాను ఏ కోర్టు మెట్లైనా ఎక్కుతాను అంటూ ఈమె మాట్లాడారు.
ఆరోపణలను ఖండించిన మంగ్లీ
ఎవరైతే నా పేరును ఉపయోగించి ఇలాంటి మోసాలకు పాల్పడ్డారో వారికి పోలీసులు న్యాయం చేయాలని కోరుతున్నాను అలాగే బాధితులకు తాను పూర్తిగా అండగా ఉంటానని తెలిపారు. నేను కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఇక్కడికి వచ్చాను అలాంటిది తాను ఎందుకు ఇతరులను మోసం చేస్తాను. నాకు ప్రస్తుతం రెండు చేతుల నిండా పని ఉంది ప్రజల ఆశీర్వాదం ఉంది ఇలాంటి తప్పుడు పని తాను చేయనని తెలిపారు. కేవలం సుబ్బారావు నా నుంచి డబ్బులు లాగడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు.
అడ్వకేట్ సుబ్బారావు గత కొద్దిరోజులుగా డబ్బు కోసం నన్ను బెదిరిస్తున్నారు అయితే తాను కొన్ని ఈవెంట్స్ తో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని అందుకే ఇప్పుడు తన పై కేసు నమోదు చేస్తున్నానని తెలిపారు. ఇక తాను ఏ రాజకీయాలలోకి వెళ్లట్లేదని ఏ రాజకీయ జెండాలు మోయడం లేదని, నాకు పాటే ప్రాణమని తెలిపారు. నా గురించి సోషల్ మీడియాలో ఎన్నో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి దయచేసి నిజా నిజాలు తెలుసుకొని వార్తలు వేయండి. నా జీవితంలో సోషల్ మీడియా నాకు ఇలా శాపంగా మారుతుందని అసలు అనుకోలేదు. నిజా నిజాలు తెలుసుకోకుండా నన్ను తప్పు పట్టొద్దు అంటూ ఈ సందర్భంగా మంగ్లీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
సోషల్ మీడియాపై మంగ్లీ ఆవేదన
మంగ్లీ తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ వివాదం ఆమె జీవితంలో ఒక శాపంగా మారుతుందని ఆమె భావిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకొని వార్తలు ప్రచారం చేయాలని ఆమె కోరుతున్నారు.


