|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 Day 2 collections: రూ.50 కోట్ల క్లబ్ లో అఖండ 2.. పడిపోయిన కలెక్షన్లు!

Published: 14-12-2025, 11:08 PM
Akhanda 2 Day 2 collections: రూ.50 కోట్ల క్లబ్ లో అఖండ 2.. పడిపోయిన కలెక్షన్లు!
  • అఖండ 2 రెండో రోజు కలెక్షన్లలో భారీ పతనం నమోదు.
  • ప్రపంచవ్యాప్తంగా రూ.58 కోట్ల గ్రాస్ సాధించి 50 కోట్ల క్లబ్‌లో చేరిక.
  • రూ.145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుదూరం.
  • రొటీన్ కథ, క్రిస్మస్ విడుదలలు సినిమాకు మైనస్‌గా మారే అవకాశం.

బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం డే 2 కలెక్షన్లలో భారీ పతనాన్ని చవిచూసింది. రూ.50 కోట్ల క్లబ్‌లో చేరినప్పటికీ, రెండో రోజు కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ నేపథ్యంలో, సినిమా లాభాల బాట పట్టడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రెండో రోజు కలెక్షన్లు భారీగా పతనం

Akhanda 2 Day 2 collections: నందమూరి బాలకృష్ణ (Balakrishna)నటించిన తాజా చిత్రం ఆఖండ 2(Akhanda 2). పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి కానీ విడుదలైన తర్వాత పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. ఈ సినిమా డిసెంబర్ 11వ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాగా 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా రెండు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్ట లేకపోయిందని తెలుస్తుంది ఇక రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 58 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది.

50 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టినప్పటికీ రెండో రోజు మాత్రం భారీగా కలెక్షన్లు పడిపోయాయని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెండవ రోజు అయిన శనివారం కేవలం 15.50 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున అంచనాలు ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ క్రమంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా భారీగానే ఉందని తెలుస్తుంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ప్రస్తుత పరిస్థితి ఏంటి?

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనించాలి అంటే సుమారు 150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లతో పాటు 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను కూడా రాబట్టాల్సి ఉందని తెలుస్తోంది.. అయితే ఈ సినిమా కలెక్షన్లు చూస్తుంటే మాత్రం బ్రేక్ ఈవెంట్ కు చాలా దూరంలోనే ఉందని తెలుస్తోంది. ఇక క్రిస్మస్ పండుగ వరకు ఎలాంటి సినిమాలు లేని నేపథ్యంలో కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది..

అఖండ 2 బ్రేక్ ఈవెన్ అయ్యేనా..

క్రిస్మస్ వరకు కలెక్షన్లు పుంజుకునేనా?

ఇక డిసెంబర్ 25వ తేదీ పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలయ్యే సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వస్తే అఖండ 2 బ్రేక్ ఈవెన్ అవ్వటం కూడా కష్టమేనని తెలుస్తోంది. ఈ సినిమా రొటీన్ కథతో రావడమే సినిమాకు మైనస్ గా మారిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా అంటేనే సినిమాల పట్ల మంచి అంచనాలు ఉంటాయి కానీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది. ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది.

సినిమా రొటీన్ కథతో రావడంతో పాటు క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల కానున్న కొత్త సినిమాలు అఖండ 2 కలెక్షన్లపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ సాధించడం చిత్ర యూనిట్‌కు పెద్ద సవాలుగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.