|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Published: 13-12-2025, 11:48 PM
అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
  • ‘అఖండ 2’ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది.
  • సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటుందని సమాచారం.
  • తాత్కాలికంగా 2026 జనవరి 9న డిజిటల్‌ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
  • బాలయ్య అఘోరా పాత్రలో అద్భుతమైన నటన, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నట సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ 2’ డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ప్రస్తుతం ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. ‘అఖండ 2’ నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.

అఖండ 2 ఓటీటీ విడుదల వివరాలు

నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 12 నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమా విడుదల సమయంలో కొన్ని ప్రారంభ ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ యాక్షన్ సినిమా మొదట డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, ఆర్థిక వివాదాల వల్ల విడుదల తేదీని వాయిదా వేశారు. అయితే, వారం ఆలస్యంగా అఖండా 2 థియేటర్లలో విడుదలైంది. ఇక తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై కూడా అప్ డేట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈసినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు?

మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ‘అఖండ 2’ మేకర్స్ దీని డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ఫైనల్ చేశారట. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందని చెబుతున్నారు. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే కొంత మంది ఇచ్చిన సమాచారం ప్రకారం ‘అఖండ 2’ నాలుగు వారాల థియేటర్-టు-ఓటీటీ విండోను పాటిస్తుందని .. అలాంటప్పుడు, ఈ సినిమా 2026 జనవరి 9 నాటికి డిజిటల్‌ రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు సమాచారం. అయితే థియేటర రిలీజ్ ఒక వారం డిలే అవ్వడంతో.. ఓటీటీ రిలీజ్ లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కానీ సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్ మాత్రం ఈసినిమాను సంక్రాంతి వరకూ స్ట్రీమింగ్ చేసి.. గట్టిగా వ్యూస్ ను సాధించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

అఖండ 2 సినిమా హైలైట్స్

ఇక అఖండ 2′ సినిమాలో బాలయ్య అఘోరాగా అద్భుతమైన నటన చూపించాడు. ఆయన పవర్ ఫుల్ యాక్టింగ్ , యాక్షన్ సీన్స్ కు అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. తనకు ఉన్న దివ్యశక్తితో చెడుపై పోరాడే పాత్ర బాలయ్యది. ఈ సీక్వెల్‌లో విలన్‌ గా ఆది పినిశెట్టి నటించి మెప్పించాడు. అతీంద్రియ శక్తులున్న ఒక రహస్యమైన వ్యక్తిగా ఆది కనిపించాడు. అఖండ 2 సినిమాలో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహాన్ సింగ్, శాశ్వత ఛటర్జీ లాంటి స్టార్స్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు. అయితే ఈమూవీ బాక్సాఫీస్ వసూళ్లు తగ్గుతుండటం మేకర్స్ ను, అభిమానులను కలవరపెడుతోంది.

బాలకృష్ణ కెరీర్, బాక్సాఫీస్ ప్రయాణం

బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 65 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే హాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. నాలుగు సినిమాలతో సక్సెస్ ఫుల్ గా ఫిల్మ్ జర్నీ కొనసాగిస్తున్నాడు. ఇంకో రెండు సినిమాలు సక్సెస్ అయితే డబుల్ హ్యాట్రిక్ ఆయన ఖాతాలో పడుతుంది. తాజాగా రిలీజ్ అయిన అఖండ 2 సక్సెస్ వైపు వెళ్తోంది.. బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రిజల్ట్ ను బట్టి.. బాలయ్య ఐదో సినిమా హిట్టా..ఫట్టా అనే విషయం తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అయితే.. మరో సినిమాతో బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ ను సాధించవచ్చు. త్వరలో మలినేని గోపీచంద్ తో తెరకెక్కించబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ సినిమాలో బాలయ్య యోధుడిలా కనిపించబోతునట్టు తెలుస్తోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

అఖండ 2 సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. బాలయ్య అఘోరా పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.