
📌 Key Points
- అఖండ-2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
- జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.
- బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్.
- సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షల్ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది! థియేటర్లను షేక్ చేసిన ‘అఖండ-2’ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మాస్ జాతర మొదలవబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది, వివరాలు చూసేయండి!
బాలయ్య మాస్ జాతర… ఓటీటీలోకి ఎంట్రీ!
నందమూరి బాలకృష్ణ (Balakrishna)అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇటీవల థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘అఖండ-2’ (Akhanda-2)డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైందని గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయాన్ని నిజం చేస్తూ..ప్రముఖ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘అఖండ-2’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.
ఎందులో చూడాలి? ఎప్పుడు సిద్ధంగా ఉండాలి?
కాగా.. అఖండకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బోయపాటి దర్శకత్వం వహించారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాను.. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్, ivy ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీ అచంట, ఇషాన్ సక్సెనా నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon), ఆది పినిశెట్టి, హర్షల్ మల్హోత్రా కీలక పాత్రలో నటించారు. వివాదాల మధ్య డిసెంబర్ 12న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది.
థియేటర్ల తర్వాత… ఇప్పుడు మీ ఇంట్లో!
A post shared by Netflix India (@netflix_in)
‘అఖండ-2’ ఓటీటీ రాకతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటనున్నాయి. బాలయ్య విశ్వరూపం మళ్ళీ వీక్షించడానికి సిద్ధంగా ఉండండి. మరిన్ని సంచలన అప్‌డేట్‌ల కోసం మా పేజీని చూస్తూ ఉండండి!


