
📌 Key Points
- నందమూరి బాలయ్య ‘అఖండ 2’ సినిమాకు ట్విట్టర్ వేదికగా పాజిటివ్ రివ్యూలు.
- బాలకృష్ణ విశ్వరూపం, బోయపాటి శ్రీను దర్శకత్వం సినిమాకు హైలైట్.
- హిందూ ధర్మం రక్షణ నేపథ్యం, తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
- ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీత, విలన్ పాత్ర ప్రభావం తక్కువగా ఉన్నాయని అభిప్రాయం.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ 2 సినిమాకు ట్విట్టర్ వేదికగా అదిరిపోయే టాక్ వస్తోంది. ప్రీమియర్లు పడగానే సినిమా చూసిన ప్రేక్షకులు బాలయ్య విశ్వరూపాన్ని, తమన్ మ్యూజిక్‌ను పొగిడేస్తున్నారు. హిందూ ధర్మం నేపథ్యంలోని ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమంటున్నారు.
అఖండ 2 ట్విట్టర్ రివ్యూలు
నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. నిన్న రాత్రి ప్రీమియర్లు పడిపోగా, నేటి నుంచి షోలు కొనసాగనున్నాయి. ఇప్పటికే బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబినేషన్ లో అఖండ సినిమా వచ్చి సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ అఖండ 2 సినిమాకు కూడా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
బాలయ్య విశ్వరూపం, తమన్ మ్యూజిక్
సినిమా చూసిన వాళ్లంతా అద్భుతం అంటున్నారు. హిందూ ధర్మం చుట్టూ కొనసాగే ఈ సినిమా, ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ బద్దలు కొట్టడం గ్యారంటీ అని సోషల్ మీడియా వేదికగా సినిమా చూసిన వాళ్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ పెద్దగా లేకపోయినా, సెకండాఫ్ మాత్రం ఇరగదీస్తుందట. దైవం మీద పడిన నిందలు తొలగించడం, హిందూ ధర్మం రక్షణ కోసం హీరో నందమూరి బాలయ్య ఏం చేస్తాడు ? అన్నది సినిమా స్టోరీ.
స్టోరీలైన్, ఫస్ట్ హాఫ్ పై అభిప్రాయాలు
ఈ కథ నేపథ్యంలో నందమూరి బాలయ్య జీవించేసాడని అంటున్నారు. అఖండ రూపంలో ఉన్న నందమూరి బాలయ్య కనిపిస్తే, థియేటర్ దద్దరిల్లిపోతుందట. దానికి తగ్గట్టుగానే మన తమన్ మ్యూజిక్ ఇరగదీసాడట. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ ఖాయం అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసారట. అందులో కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేదని ప్రేక్షకులు అంటున్నారు. బాలయ్య హీరోగా ఇరగదీసినప్పటికీ విలన్ ప్రభావం పెద్దగా కనిపించదట. కొన్ని సీన్లు సాగదీయడంతో బోర్ కొడుతాయట.
మొత్తంగా, అఖండ 2 సినిమాకు మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ, బాలయ్య నటన, సెకండాఫ్, తమన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.


