|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖిల్ ఫ్యాన్ మళ్లీ హంగామా! డై హార్ట్ ఫ్యాన్ ఏం చేశాడంటే?

Published: 10-07-2026, 12:29 PM
అఖిల్ ఫ్యాన్ మళ్లీ హంగామా! డై హార్ట్ ఫ్యాన్ ఏం చేశాడంటే?

అఖిల్ అభిమాని మళ్లీ వైరల్ అయ్యాడు. లెనిన్ సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద హంగామా చేసిన ఆ అభిమాని వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అఖిల్ స్పందన ఇదిగో.

Key Points

1

అఖిల్ డై హార్ట్ ఫ్యాన్ లెనిన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ వద్ద ప్రత్యక్షం

2

కటౌట్ కు పూలమాల వేసి, గుమ్మడికాయతో దిష్టి తీశాడు

4

అఖిల్ ఆ వీడియో చూసి మురిసిపోయి నవ్వుకున్నాడు

మళ్లీ వచ్చాడు డై హార్ట్ ఫ్యాన్

Akhil: అభిమాన హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు.. వారి అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అభిమానుల హడావిడితోనే సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే అందులో మరీ ముఖ్యంగా కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే అఖిల్ ఏజెంట్ సినిమా విడుదలైనప్పుడు “అయ్యగారే నెంబర్ వన్.. అయ్యగారు వస్తారు.. అయ్యగారే కరెక్ట్” అనే డైలాగ్ తో ఊహించని పాపులారిటీ సంపాదించుకున్న అఖిల్ డైహార్ట్ ఫ్యాన్ ఇప్పుడు మళ్లీ లెనిన్ సినిమా రిలీజ్ సమయంలో ప్రత్యక్షమై అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

అప్పుడు అలాంటి డైలాగులతో ఊగిపోయిన ఈయన.. ఇప్పుడు మరో కొత్త డైలాగులతో థియేటర్ వద్ద సందడి చేస్తుంటే.. అది చూసిన నెటిజన్స్ మాత్రం మళ్లీ వచ్చాడ్రోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. థియేటర్ వద్ద ఆ అభిమాని చేసిన హంగామా చూసిన అఖిల్ రియాక్షన్ కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

అఖిల్ తాజాగా నటించిన చిత్రం లెనిన్.. ఈ సినిమా హిట్ కోసం అఖిల్ ఎంతగా తపించాడో.. కష్టపడ్డాడో అందరూ చూశారు. ఇక ఆయన కష్టాన్ని గుర్తించి బూస్టింగ్ ఇవ్వడానికి అఖిల్ పాత వీరాభిమాని మళ్లీ థియేటర్ ముందుకి వచ్చాడు. సోషల్ మీడియాలో అయ్యగారే నంబర్ వన్ అంటూ ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ అభిమాని ఇప్పుడు లెనిన్ సినిమా ఆడుతున్న థియేటర్ వద్దకు చేరుకొని.. తన ప్రాణప్రదమైన హీరో అఖిల్ కటౌట్ కి పెద్ద పూలమాలవేసి ..గుమ్మడికాయతో దిష్టి కూడా తీశాడు. అంతేకాదు మీడియాతో మాట్లాడుతూ తన పాత స్టైల్ లో అఖిల్ కి అదిరిపోయే ఎలివేషన్లు ఇచ్చారు. ఈ సినిమా కోసం అఖిల్ ను, చిత్ర యూనిట్ పడ్డ కష్టాన్ని కొనియాడుతూ సినిమాపై మరింత అటెన్షన్ క్రియేట్ చేశాడు.

థియేటర్ వద్ద అభిమాని హంగామా

అలా తన అభిమాని థియేటర్ ముందు తన కటౌట్ కి పూలమాలవేసి గుమ్మడికాయతో దిష్టితీస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన అఖిల్ మురిసిపోతూ తెగ నవ్వుకున్నారు. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఏది ఏమైనా అప్పుడప్పుడు అభిమానులు చేసే ఇలాంటి పనులు..హీరోలకు పూర్తిస్థాయిలో ధైర్యాన్ని, స్వాంతనను కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే గత ఇంటర్వ్యూలలో అఖిల్ కష్టాన్ని చూసిన ఆయన అభిమాని చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఇక ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని తన హీరోకి కెరియర్ లో అత్యంత కీలకమైన సమయంలో తోడుగా నిలబడడానికి మళ్లీ వచ్చేసాడు. ఏది ఏమైనా తన అభిమాన హీరోని గెలిపించుకోవడానికి ఆ అభిమాని పడుతున్న తపన చూసి నెటిజన్లు ముచ్చట పడుతూ అభిమాని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Most happiest Akhil fan right now..

అఖిల్ రియాక్షన్ వైరల్

Blockbuster reports allover #Lenin

Ayyagare no 1 🔥 pic.twitter.com/AIlqHK778e

— King Balu (@rockstarbalu99) July 10, 2026

అభిమానుల ప్రేమ హీరోలకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఈ డై హార్ట్ ఫ్యాన్ మళ్లీ తన హంగామాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అఖిల్ స్పందన కూడా అభిమానులను ఆనందపరిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.