
📌 Key Points
- రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కవలలు (పాప, బాబు) జన్మించారు.
- మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
- ఉపాసన ప్రసవం అపోలో ఆసుపత్రిలో జరిగింది, ఇది ఆమెకు భాగస్వామ్యం ఉన్న సంస్థ.
- నెటిజన్లు ఆసుపత్రి బిల్లు ఎంత అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక పాప, ఒక బాబు జన్మించడంతో మెగా కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ శుభవార్తను చిరంజీవి స్వయంగా ప్రకటించారు.
రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కవలల జననం
Ram Charan–Upasana Twins: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల ( Upasana Konidela) దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ సారి కవల పిల్లలు ( Ram Charan–Upasana Twins) జన్మించడంతో మెగా కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన మెగా ఫ్యామిలీ ముందుగా ప్రకటించినట్లుగానే, ఉపాసన కవలలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి రామ్ చరణ్-ఉపాసన జంటకు జన్మించారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు. తమ కుటుంబంలోకి మరో ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ పోస్ట్ పెట్టగానే, మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అర్ధరాత్రి ఈ ప్రకటన రావడంతో గల్లీలో టపాకాయలు పేల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఫ్యాన్స్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి మరో ఇద్దరూ వారసులు వచ్చారు. ఇప్పటికే రామ్ చరణ్ కు క్లింకారా కొణిదెల అనే కూతురు ఉంది. 2023లో ఆమె జన్మించగా.. ఇప్పుడు మరో ఇద్దరు వారసులు వచ్చారు. ఇందులో ఒక మగ కాగా మరొకరు అమ్మాయి. అయితే రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఆదివారం ఉదయం అంటే సుమారు 12 గంటల సమయంలో కవలలు జన్మించారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పంచుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఉపాసన అలాగే పుట్టిన కవలలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని మెగాస్టార్ చిరంజీవి తన పోస్టులో వెల్లడించారు. దీంతో మెగా ఫ్యాన్స్ అందరు ఊపిరి పీల్చుకున్నారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన నేపథ్యంలో ఆసుపత్రి బిల్లు ఎంత అయి ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు నెటిజన్స్. ఉపాసన ప్రసవం అపోలో ఆసుపత్రిలోనే జరిగింది. గతంలో క్లింకారా జన్మించినప్పుడు కూడా ఇది ఆసుపత్రి లో ఉపాసన ప్రసవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అపోలో ఆసుపత్రిలో వన్ ఆఫ్ ద పార్టనర్ ఉపాసన. అపోలో ఆసుపత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలే ఈ ఉపాసన కొణిదెల.
చిరంజీవి ప్రకటన, అభిమానుల ఆనందం
ఈ సంస్థలో ఉపాసనకు భాగస్వామ్యం ఉంది. ఆమె కీలక పాత్ర కూడా పోషిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఉపాసనకు ఈ ఆసుపత్రిలో ఎలాంటి చార్జీలు తీసుకోకుండానే వైద్యులు చికిత్స అందించినట్లు చెబుతున్నారు. అయితే మరి కొంతమంది విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆస్పత్రిలో ఓనర్ అయిన లెక్క ప్రకారం బిల్ కట్టాల్సిందేనని.. ఉపాసన ఫ్యామిలీ కూడా కొంత మొత్తంలో డబ్బును అపోలో ఆసుపత్రికి కడుతుందని వెల్లడిస్తున్నారు. కానీ ఈ విషయాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతారని చెబుతున్నారు.
Celebrations @ Apollo #RamCharan #Peddi pic.twitter.com/xVsSbUS58J
ఆసుపత్రి బిల్లుపై నెటిజన్ల అంచనాలు
— IndiaGlitz Telugu™ (@igtelugu) January 31, 2026
Congratulations @AlwaysRamCharan @upasanakonidela Twins 😍 #ramcharan #Upasana pic.twitter.com/OI16OEPd9L
— Gangleader ☄️ (@CKonidela81958) January 31, 2026
రామ్ చరణ్, ఉపాసనలకు కవలలు జన్మించడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉపాసన, పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


