
📌 Key Points
- అఖిల్ కెరీర్‌లో కమర్షియల్ హిట్ లేకపోవడంతో ‘లెనిన్’ కీలకంగా మారింది.
- ‘లెనిన్’ టీజర్ విడుదల తర్వాత అక్కినేని కాంపౌండ్‌లో ఆందోళనలు మొదలయ్యాయి.
- గతంలో ‘ఏజెంట్’ డిజాస్టర్ కావడంతో ‘లెనిన్’పై అంచనాలు భయాలు రెండూ ఉన్నాయి.
- టీజర్‌లో కథను దాచిపెట్టడం కంటెంట్ బలహీనతకు సంకేతమని ట్రేడ్ వర్గాల అనుమానం.
అక్కినేని అఖిల్ కెరీర్లో మరో కీలక చిత్రం ‘లెనిన్’పై ట్రేడ్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమా అఖిల్‌కు ‘డూ ఆర్ డై’ అంటున్నారు. టీజర్ విడుదలైన తర్వాత సినిమా కంటెంట్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అఖిల్ కెరీర్‌కు ‘లెనిన్’ డూ ఆర్ డైనా?
Akhil Lenin: అక్కినేని అఖిల్ …అందం, ఆస్తి, బ్యాక్ గ్రౌండ్.. ఇలా ఈ కుర్ర హీరోకి లేనిది లేదు. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా సినిమాలు చేస్తూ ఉన్నా ఒక్క కమర్షియల్ హిట్ కూడా ఇప్పటి వరకు కొట్టని పరిస్థితి. ఈ క్రమంలో ఎలాగైనా సాలిడ్ హిట్టు కొట్టి తీరుతానంటూ మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో లెనిన్ అంటూ సరికొత్త సినిమాని పట్టాలెక్కించాడు.కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ చూశాక అక్కినేని కాంపౌండ్ లో గుబులు మొదలైందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
అఖిల్ కి ఇది డూ ఆర్ డై అనే సిట్యూఎషన్
తిరుపతి, చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో లెనిన్ అనే మాస్ కుర్రాడిగా అఖిల్ కనిపిస్తున్నాడు. నాటకాలు వేసే అమ్మాయితో ప్రేమాయణం, ఆ తర్వాత హఠాత్తుగా కత్తి పట్టి ఊరి కోసం పోరాడే రొటీన్ ఫార్ములాలోనే టీజర్ కట్ చూస్తే అర్థమవుతోంది. గతంలో వినరో భాగ్యమే విష్ణు కథ అంటూ మోస్తరు సినిమాతో వచ్చిన దర్శకుడి కాంబోలో అఖిల్ ని నమ్మి భారీ బడ్జెట్ పెట్టడం అంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి.
నిజానికి అఖిల్ కి ఇది డూ ఆర్ డై అనే సిట్యూఎషన్ అనే చెప్పాలి. గతంలో భారీ అంచనాలతో వచ్చిన ‘ఏజెంట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అంతకుముందు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ కొద్దిగా పర్లేదనిపించినా అఖిల్ కి కావలసిన మాస్ ఇమేజ్ ని మాత్రం తీసుకురాలేకపోయింది. ఇప్పుడు ‘లెనిన్’ లో గెడ్డం పెంచి, చిత్తూరు యాస మాట్లాడుతూ కొత్తగా ట్రై చేసినా, అది ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది డౌటే. గతంలో ‘రంగస్థలం’ లో రామ్ చరణ్, ‘పుష్ప’ లో అల్లు అర్జున్ చేసిన మాస్ మేకోవర్ లతో పోలిస్తే అఖిల్ లుక్ లో ఆ న్యాచురాలిటీ ఎక్కడో మిస్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టీజర్ చూసి ట్రేడ్ వర్గాల్లో గుబులు ఎందుకు?
కథలో దమ్ము లేనప్పుడే పబ్లిసిటీ ట్రిక్స్
పైగా టీజర్ లో అసలు కథను రివీల్ చేయకుండా కేవలం లవ్ స్టోరీ, కొద్దిగా యాక్షన్ సీన్స్ మాత్రమే చూపించి విలన్ పాత్రలను దాచడం చూస్తుంటే, సినిమాలో కంటెంట్ వీక్ గా ఉందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కథలో దమ్ము లేనప్పుడే ఇలాంటి పబ్లిసిటీ ట్రిక్స్ ప్లే చేస్తారనేది ట్రేడ్ పండితుల మాట.
ఇక ఈ సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉంది. ‘మిస్టర్ బచ్చన్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఘోరమైన పరాజయాన్ని చవిచూసిన ఈ బ్యూటీ, రీసెంట్ గా వచ్చిన చిత్రాలతో ఐరన్ లెగ్ అనే ముద్రను మూటగట్టుకుంది. ఆమె గ్లామర్ తప్ప నటనకు స్కోప్ లేని పాత్రలనే ఎంచుకుంటోందనే టాక్ ఉంది. ఈ సినిమాలో కూడా నాటకాలు వేసే అమ్మాయిగా ఆమెను చూపించినా, కేవలం గ్లామర్ కోసమే పరిమితం చేసినట్లు టీజర్ హింట్ ఇస్తోంది.
కంటెంట్ వీక్‌గా ఉందా? పబ్లిసిటీ ట్రిక్సా?
పెద్ది మేనియాలో కొట్టుకుపోతుందా ?
మరోవైపు నిర్మాత నాగవంశీ కి ఈ మధ్య కాలంలో ‘ఫంకీ’ సినిమా రూపంలో పెద్ద షాక్ తగిలింది. ఆ నష్టం నుంచి తేరుకోకముందే ‘లెనిన్’ పై భారీగా ఖర్చు పెట్టడం సితార బ్యానర్ కి రిస్క్ అనే చెప్పాలి. వచ్చే నెల జూన్ 4వ తేదీన ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమవుతున్న పెద్ది సినిమా రిలీజ్ ఉండటంతో, ‘లెనిన్’ ప్రమోషన్లను వారం రోజులు ఆపి ఆ తర్వాత స్పీడ్ పెంచాలని చూస్తున్నారు.
కానీ అప్పటికే ‘పెద్ది మేనియాలో ఈ సినిమా పబ్లిసిటీ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.తమన్ సంగీతం కూడా ఈ మధ్య కాలంలో రొటీన్ గా మారుతుండటంతో ‘లెనిన్’ కి ఆడియో పరంగా ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. మొత్తానికి ఫ్లాపుల హీరోయిన్, సక్సెస్ లేని హీరో, అనుభవం లేని దర్శకుడి కాంబినేషన్ లో వస్తున్న ‘లెనిన్’ జూన్ 26న ఎలాంటి షాక్ ఇవ్వబోతుందోనని అప్పుడే ట్రోల్స్ మొదలుపెట్టారు యాంటీ ఫ్యాన్స్. ఏది ఏమైనా ఈ సారి హిట్టు పక్కా అని కాన్ఫిడెంట్ గా ఉన్న అఖిల్ కి జూన్ 26న ఎలాంటి ఫలితం ఎదురు కానుందో !
మొత్తంగా, ‘లెనిన్’ చిత్రం అఖిల్ కెరీర్‌కు అత్యంత కీలకమైనది. టీజర్ ద్వారా రేకెత్తిన అనుమానాలను పటాపంచలు చేసి, సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. అఖిల్ భవిష్యత్తు ఈ సినిమాపైనే ఆధారపడి ఉంది.


