|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అఖిల్ ‘లెనిన్’ వాయిదా! రామ్ చరణ్ ‘పెద్ది’ మామూలు ఎఫెక్ట్ కాదుగా!!

Published: 05-02-2026, 9:35 PM
షాకింగ్: అఖిల్ 'లెనిన్' వాయిదా! రామ్ చరణ్ 'పెద్ది' మామూలు ఎఫెక్ట్ కాదుగా!!
  • అఖిల్ ‘లెనిన్’ విడుదల వాయిదా: రామ్ చరణ్ ‘పెద్ది’ ఎఫెక్ట్ తో మే 1 నుండి తదుపరి తేదీకి మార్పు!
  • ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల ఖరారు కావడంతో, అఖిల్ సినిమా విడుదల తేదీలో మార్పులు అనివార్యం!
  • అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు సరైన హిట్ లేదు, ‘లెనిన్’ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు.
  • ‘లెనిన్’ కొత్త విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది, వేచి చూడండి!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడని అందరూ నమ్ముతున్నారు. అయితే, ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

‘పెద్ది’ రిలీజ్ ఎఫెక్ట్: ‘లెనిన్’ వాయిదా?

Lenin: అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా లెనిన్. అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే, అఖిల్ కి ఇప్పటివరకు సరైన హిట్ లేదు. అందుకే, లెనిన్ సినిమా తప్పకుండా విజయం సాదిస్తుడని నమ్ముతున్నారు. అందుకే. లెనిన్(Lenin) సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా థియేటర్స్ లోకి రావాలని కోరుకుంటున్నారు.

అఖిల్ కెరీర్ కి ‘లెనిన్’ హిట్టేనా?

కానీ, లెనిన్ సినిమా వాయిదా పడటం ఖాయం అని తెలుస్తోంది. దానికి కారణం రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా. పెద్ది సినిమాను వాయిదా వేస్తూ అధికారిక ప్రకనట చేశారు మేకర్స్. ఈ సినిమాను ముందుగా మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూశారు. కానీ. అనుకోని కారణాల వల్ల పెద్ది సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయబోతున్నట్టుగా అధికారిక ప్రక్కన చేశారు.

కొత్త విడుదల తేదీ ఎప్పుడో?

అయితే, అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న లెనిన్ సినిమాను మే 1న విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్.కానీ, ఏప్రిల్ 30న పెద్ది వస్తుంది కాబట్టి లెనిన్ సినిమా వాయిదా పడే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. అయితే, కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి, ఈ న్యూస్ ఇపప్టికి మాత్రం రూమర్ గానే ఉంది. చూడాలి మరి ఈ మూవీపై మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తారా లేదా అని?

అఖిల్ ‘లెనిన్’ సినిమా విడుదల తేదీ వాయిదా పడటం అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే. ఈ సినిమా కొత్త విడుదల తేదీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.