|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ vs అఖిల్: ‘లెనిన్’ విడుదలపై ‘పెద్ది’ పంచాయితీ! అక్కినేని హీరో వెనక్కి తగ్గేనా?

Published: 31-03-2026, 10:05 AM
రామ్ చరణ్ vs అఖిల్: 'లెనిన్' విడుదలపై 'పెద్ది' పంచాయితీ! అక్కినేని హీరో వెనక్కి తగ్గేనా?
  • రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల తేదీ కారణంగా అఖిల్ ‘లెనిన్’ సినిమా వాయిదా.
  • ‘పెద్ది’ సినిమా మార్చి 27 నుండి ఏప్రిల్ 30కి వాయిదా పడింది, ‘లెనిన్’ మే 1 నుండి జూన్ 26కి మారింది.
  • నిర్మాత ఎస్కేఎన్ పొరపాటున ‘పెద్ది’ జూన్ 26న విడుదల అని చెప్పడంతో అఖిల్ సినిమాకు ఇబ్బందులు.
  • రామ్ చరణ్ సినిమాకు పోటీగా అఖిల్ సినిమా విడుదల కాకపోవచ్చని అంచనా.

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కారణంగా అఖిల్ ‘లెనిన్’ సినిమా విడుదల తేదీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ‘పెద్ది’ సినిమా విడుదల తేదీ కారణంగా అఖిల్ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

‘పెద్ది’ సినిమా విడుదల తేదీ మార్పులు

Peddi vs Lenin: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాకు తలనొప్పికి మారిందని చెప్పాలి. అఖిల్ లెనిన్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పెద్ద సినిమా కారణంగా తరచు వాయిదా పడుతూ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తుంది. అయితే పెద్ది సినిమా కూడా యధావిధిగా వాయిదా పడుతూ అఖిల్ లెనిన్ విడుదల సినిమాకు పోటీగా వస్తున్న నేపథ్యంలో అఖిల్ సినిమా విడుదల విషయంలో గందరగోళం ఏర్పడుతోంది. పెద్ది సినిమాని మార్చి 27వ తేదీ విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించడంతో లెనిన్ సినిమా మే ఒకటో తేదీ విడుదల చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు.

ఇకపోతే పెద్ది సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా మార్చి 27న కాకుండా ఏప్రిల్ 30వ తేదీ విడుదల తేదీని ఖరారు చేస్తూ అధికారకంగా ప్రకటించారు. దీంతో మే ఒకటో తేదీ విడుదల కావాల్సిన లెనిన్ సినిమా మరోసారి వాయిదా పడుతూ ఏకంగా జూన్ 26వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇలా మే మంచి వాయిదా పడిన ఈ సినిమా జూన్ 26వ తేదీ విడుదలకు సిద్ధం కాగా, పెద్ది సినిమా కూడా తిరిగి జూన్ 26వ తేదీనే విడుదల కాబోతోంది.

‘లెనిన్’ సినిమాపై ‘పెద్ది’ ప్రభావం

ఏప్రిల్ 30 వ తేదీన పెద్ది వాయిదా పడి జూన్ 5వ తేదీ విడుదల కాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇటీవల ఓ సినిమా వేడుకలో భాగంగా నిర్మాత ఎస్కే ఎన్ పొరపాటున నోరు జారుతూ పెద్ది జూన్ 26వ తేదీ విడుదల కాబోతుందని తెలిపారు. ఇలా పెద్ది సినిమా విడుదల తేదీ లీక్ చేయడంతో ఇప్పుడు అఖిల్ సినిమా ఇబ్బందులలో పడింది. రామ్ చరణ్ పెద్ది సినిమాపై భారీగా అంచనాలు ఉన్న నేపథ్యంలో చరణ్ కు పోటీగా అఖిల్ లెనిన్ సినిమా విడుదల చేయరు. దీంతో మరోసారి చరణ్ కోసం అఖిల్ వెనకడుగు వేయక తప్పదని తెలుస్తోంది. ఇలా లెనిన్ సినిమాకు పెద్ది తలనొప్పిగానే మారిందని తెలుస్తుంది.

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేయాల్సిందేనా..

అఖిల్ సినిమా విడుదల వాయిదా?

ఇక పెద్ది కొత్త విడుదల తేదీ బయటకు వచ్చినప్పటికీ చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు ఈ సినిమా విడుదల వాయిదా గురించి ఎక్కడ స్పందించలేదు. మరి చరణ్ తన పెద్ది సినిమా విడుదల విషయంలో తేదీలు మార్పులు చేసుకుంటారా? లేదంటే అఖిల్ మరోసారి చరణ్ కోసం జూన్ 26వ తేదీని త్యాగం చేయాల్సి వస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం కదా రెండు సంవత్సరాలుగా ఎంతో శ్రమిస్తున్నారు. అఖిల్ సైతం ఈ సినిమా పైనే అంచనాలను పెట్టుకున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మొత్తానికి రామ్ చరణ్ సినిమా కోసం అఖిల్ తన సినిమా విడుదల తేదీని మార్చుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు, మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.