|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖిల్‌ మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్ ?.. అక్కినేని హీరో ఓ ఇంటివాడయ్యేది అప్పుడే

Published: 26-05-2025, 11:51 AM
అఖిల్‌ మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్ ?.. అక్కినేని హీరో ఓ ఇంటివాడయ్యేది అప్పుడే

అక్కినేని అఖిల్‌ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో ఆయన ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వారి వివాహ తేదీని ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Key Points

1

అఖిల్‌కు జూన్‌ 6న వివాహం ఖరారైందని వార్తలు

2

జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో అఖిల్‌ వివాహం

4

అఖిల్‌ ప్రస్తుతం లెనిన్‌ సినిమాలో నటిస్తున్నారు

అఖిల్‌ వివాహ తేదీ ఖరారు?

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే ఆయన ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లికి వేళ అయ్యింది. త్వరలోనే ఆయన మూడు ముళ్ల బంధంతో ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. అఖిల్‌.. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు జైనబ్‌తో ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్‌ 26న వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

అఖిల్‌, జైనబ్‌ల ఎంగేజ్‌మెంట్‌కి ఇండస్ట్రీ నుంచి కొద్ది మంది సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక ఇప్పుడు పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. తాజాగా అఖిల్‌ మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్ అయ్యిందట. జూన్‌ 6న అఖిల్‌, జైనబ్‌ల మ్యారేజ్‌ ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అఖిల్‌.. టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున, అమలల కుమారుడు అనే విషయం తెలిసిందే.

జైనబ్‌తో అఖిల్‌ వివాహం

అఖిల్‌, జైనబ్‌లకు ముందుగానే పరిచయం ఉందని, వీరిద్దరు రహస్యంగా ప్రేమించుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఎనిమిదేళ్ల క్రితమే ప్రముఖ వ్యాపార వేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో అఖిల్‌కి ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. నాగచైతన్య మ్యారేజ్‌ టైమ్‌లోనే అఖిల్‌ పెళ్లి కూడా చేయాలనుకున్నారు నాగార్జున. కానీ అనూహ్యంగా ఆ ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ అయ్యింది.

గతంలోని ఎంగేజ్‌మెంట్‌ రద్దు

ఇక అఖిల్‌ ప్రస్తుతం `లెనిన్‌` చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌. మురళీ కృష్ణ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్(టీజర్‌) విడుదలైంది.

రాయలసీమ బ్యాక్‌ డ్రాప్ లో సాగే ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. అఖిల్‌ ఈ సారి బలమైన కంటెంట్‌తో వస్తున్నాడని అనిపిస్తుంది. హిట్‌ ఛాయలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించే అవకాశం ఉందట.

అఖిల్‌ వివాహ వార్తలతో అభిమానులు ఆనందంగా ఉన్నారు. అయితే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది. అఖిల్‌ సినిమా కెరీర్‌లోనూ మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.