|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్‌.. శ్రీయ భర్త ఎవరు? ఇప్పుడేం చేస్తుంది?

Published: 14-06-2025, 1:33 AM
అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్‌.. శ్రీయ భర్త ఎవరు? ఇప్పుడేం చేస్తుంది?

అఖిల్ అక్కినేని మరియు శ్రియా భూపాల్ మధ్య నిశ్చితార్థం రద్దు కావడం సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. శ్రియా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అని తెలుసుకున్నాం. ఈ కథనంలో ఆమె జీవితం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Key Points

1

అఖిల్ అక్కినేని మరియు శ్రియా భూపాల్ నిశ్చితార్థం రద్దు.

2

శ్రియా భూపాల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్.

4

అనిందిత్ రెడ్డి తెలంగాణ రాజకీయ ప్రముఖుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు.

అఖిల్ మరియు శ్రియా నిశ్చితార్థం

పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతే అది సామాన్యులకు సంకటం కావచ్చు కానీ సెలబ్రిటీల భవిష్యత్తుకు ఏ మాత్రం ఆటంకం కాదనేది తెలిసిందే. అందుకే ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు సర్వసాధారణంగా కనిపించే తారా లోకంలో సంఘటనలు  సామాన్యులకు ఎప్పుడూ  వింతల్లా, విశేషాల్లాగే ఉంటాయి. అలాంటిదే అఖిల్‌ ప్రేమ, నిశ్చితార్ధం, బ్రేకప్‌… తాజాగా పెళ్లి… అక్కినేని వంశ ఘనమైన నట వారసత్వాన్ని మోయడానికి సినీ రంగంలోకి దిగిన అఖిల్‌… ఇంకా కెరీర్‌ నిర్మాణంలో తడబడుతూనే ఉన్నాడనేది తెలిసిందే.

అయితే కారణం తెలీదు గానీ చాలా మంది నట వారసులకు భిన్నంగా ఇంకా కెరీర్‌ రూపుదిద్దుకోకుండానే అఖిల్‌ పెళ్లికి మాత్రం తొందరపడ్డాడనే చెప్పాలి. నిజానికి 2016లో, అఖిల్‌ అక్కినేని తన ప్రియురాలైన 26 ఏళ్ల శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు కేవలం 22 సంవత్సరాలు అని సమాచారం.  అంటే అక్కినేని యంగ్‌ హీరోకి ఆమెకీ దాదాపు 4 సంవత్సరాల వయస్సు అంతరం ఉందని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే…తాజాగా అఖిల్‌ పెళ్లి చేసుకున్న యువతి కూడా తనకన్నా వయసులో పెద్ద అంటూన్నారు.

శ్రియా భూపాల్: వృత్తి మరియు వ్యక్తిగత జీవితం

మరోవైపు అఖిల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న శ్రియా భూపాల్‌(Shriya Bhupal) ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తోంది? అనే విషయానికి వస్తే… హైదరాబాద్‌లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన జివికె వారి ఇంట జన్మించిన శ్రియ, ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్‌ డిజైనర్, కాస్ట్యూమ్‌ మేకర్‌.

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ స్కూల్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో ఆమె పట్టభద్రురాలైంది, ఫ్యాషన్‌ డిజైనర్‌గా  శ్రియా శరణ్, సమంతా రూత్‌ ప్రభు  కాజల్‌ అగర్వాల్‌ వంటి టాప్‌ టాలీవుడ్‌ సెలబ్రిటీలకు కూడా ఆమె డిజైన్లను అందించారు.  అంతేకాకుండా శ్రియా ’శ్రియా సోమ్‌’ అనే దుస్తుల బ్రాండ్‌ కు  వ్యవస్థాపకురాలు కూడా. ప్రస్తుతం ఆమె  లో ప్రొఫైల్‌ మెయిన్‌ టెయిన్‌ చేస్తున్నా… తన పనిలో బిజీగానే ఉన్నారని సమాచారం.

శ్రియా ప్రస్తుత జీవితం

అఖిల్‌తో బ్రేకప్‌ తర్వాత ఆమె చాలా వేగంగా కొత్త అనుబంధంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయ ప్రముఖుడు, ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కుమారుడైన అనిందిత్‌ రెడ్డి ని  ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు.  సినిమా సెలబ్రిటీ కాకపోయినా అనిందిత్‌ రెడ్డి కూడా సాదా సీదా యువకుడేమీ  కాదు. అత్యంత అరుదైన రంగంలో అతను రాణిస్తున్నాడు.

హైదరాబాద్‌  నుంచి టాప్‌ క్లాస్‌ రేసింగ్‌ డ్రైవర్‌గా నిలిచాడు. గత  2016లో యూరో జెకె 16 ఛాంపియన్ షిప్, యూరో జెకె 2017 ఛాంపియన్ షిప్‌లలో పాల్గొన్నాడు, ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌స్పోర్ట్స్‌ క్లబ్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎమ్‌ఎస్‌సి)లో 2017లో మోటార్‌స్పోర్ట్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచాడు.అతను ఢిల్లీలో జరిగిన వోక్స్‌వ్యాగన్‌ వెంటో కప్‌ 2015ను గెలుచుకున్నాడు.2019లో, అతను  వరల్డ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ ఫార్మ్‌ నుంచి అత్యుత్తమ పెర్ఫార్మర్‌గా ఎంపికయ్యాడు.

చివరగా, అఖిల్ మరియు శ్రియా విషయం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రియా తన వృత్తి జీవితంలో రాణిస్తూ, సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.