
📌 Key Points
- అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమా మార్చి 2024లో విడుదల కానుంది.
- నిర్మాత నాగ వంశీ ఇంటర్వ్యూలో విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు.
- శ్రీ లీల స్థానంలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్నారు.
- మార్చిలో రామ్ చరణ్, నాని సినిమాలతో లెనిన్ పోటీపడనుంది.
అఖిల్ ‘లెనిన్’ సినిమా విడుదలపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ పోటీ నడుమ అఖిల్ విజయం సాధిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
‘లెనిన్’ విడుదల తేదీ ఖరారు?
Lenin Movie: అక్కినేని వారసుడిగా అఖిల్ ,అఖిల్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఇప్పటివరకు ఈయన సుమారు 5 సినిమాలలో నటించారు కానీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఎలాగైనా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవాలనే కసితో సరికొత్త కథ నేపథ్యంలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ అఖిల్ (Akhil)కు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. ఇక ఈయన చివరిగా ఏజెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘోరంగా నిరాశపరిచింది.
ప్రస్తుతం అఖిల్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి (Murali Kishore Abburi)దర్శకత్వంలో యాక్షన్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న లెనిన్(Lenin) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉండగా హీరోయిన్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాదిలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా శ్రీ లీలను ఎంపిక చేశారు కొంత భాగం షూటింగ్ చేసిన తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో తిరిగి భాగ్య శ్రీ(Bhagya Shri) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ లీలపై షూట్ చేసిన సన్నివేశాలను భాగ్యశ్రీపై పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.
హీరోయిన్ మార్పు: శ్రీ లీల స్థానంలో భాగ్యశ్రీ
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో చిత్ర బృందం విడుదల తేదీ పట్ల క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగ వంశీ అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. లెనిన్ సినిమా చాలా బాగా వచ్చిందని వచ్చేయడాది మార్చిలో ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా విడుదల కాబోతున్నట్లు నాగ వంశీ వెల్లడించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ కు పోటీగా అఖిల్
పెద్ద సినిమాల మధ్య ‘లెనిన్’ పోటీ
ఇకపోతే ఈ సినిమాని మార్చిలో విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మరి కొంతమంది కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి డెకాయిట్, ది ప్యారడైజ్, పెద్ది సినిమాలు మార్చిలోనే విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలోనే నాని, రామ్ చరణ్ కు పోటీగా అఖిల్ తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంటారా? లేదంటే మళ్లీ ప్రేక్షకులను నిరాశ పరుస్తారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా రాయలసీమ లవ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా విషయంలో అఖిల్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. మరి లెనిన్ సినిమా అఖిల్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
అఖిల్ ‘లెనిన్’ మార్చిలో భారీ పోటీ మధ్య విడుదల కానుంది. ఇది అఖిల్ కెరీర్‌కు కీలకం కానుంది. ఈసారి విజయం సాధించి, తన స్థాయిని నిలబెట్టుకుంటాడా అనేది ఆసక్తిగా మారింది.


