
📌 Key Points
- AI టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీల ఫోటోలు, వీడియోల దుర్వినియోగం పెరుగుతోంది.
- పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తన ఫోటోల దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
- అకీరా తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
- అకీరా నటనలో శిక్షణ తీసుకుంటున్నారు, సినీ రంగ ప్రవేశంపై ఇంకా స్పష్టత లేదు.
ప్రస్తుతం AI టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తన ఫోటోలు, వీడియోలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
AI టెక్నాలజీతో సెలబ్రిటీలకు కష్టాలు
Akira Nandan: ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామందికి ఇది ప్రయోజనకరంగా మారిన మరికొంతమందికి ఎంతో ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏ ఐ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి ఫోటోలను వీడియోలను వారి వాయిస్ ఉపయోగించుకుంటూ చాలామంది ఆర్థికంగా లాభ పొందుతున్నారు. మరి కొంతమంది సెలబ్రిటీల ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
తాజాగా మరొక స్టార్ హీరో తనయుడు సైతం ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కుమారుడు అఖీరా నందన్(Akira Nandan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అకీరా ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు కానీ ఈయనకు హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది అకీరా నందన్ ఫోటోలు, వీడియోలు అతని వాయిస్ ఏ ఐ టెక్నాలజీ ద్వారా ఉపయోగించి దుర్వినియోగానికి పాల్పడుతున్న నేపథ్యంలోనే అకిరా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది.
ఫోటోల దుర్వినియోగంపై అకీరా నందన్ ఫిర్యాదు
ఈ నేపథ్యంలోనే తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలి అంటూ ఆఖీరా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలు వీడియోలను ఉపయోగించి అసభ్యకరమైన, తప్పుదారి పట్టించే కంటెంట్ ను వెంటనే తొలగించాలని కోరుతూ ఈయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈయన దాఖలు చేసిన పిటీషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇక అకీరా విషయానికి వస్తే ప్రస్తుతం అకీరా నటనలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆరాటపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆఖీరా సినీ ఎంట్రీ పై ఎలాంటి అధికారక ప్రకటనలు మాత్రం వెలబడలేదు. ఇక ఈ వార్తలపై అకీరా తల్లి రేణు దేశాయ్ పలు సందర్భాలలో స్పందిస్తూ ఖండించారు. అకీరాకు నటన కంటే కూడా సంగీతం అంటే చాలా ఇష్టం అనే విషయాన్ని పలు సందర్భాలలో వెల్లడించారు. మరి ఈయన హీరోగా వెండి తెరపై సందడి చేస్తారా? లేదంటే సంగీత దర్శకుడిగా వెండితెర వెనక మ్యాజిక్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అకీరా విదేశాలలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తరచూ తన తండ్రితో కలిసి కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
అకీరా సినీ ఎంట్రీపై అభిమానుల ఆసక్తి
అకీరా నందన్ భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన నటుడిగా రాణిస్తారా లేక సంగీత దర్శకుడిగా వెలుగులోకి వస్తారా అనేది వేచి చూడాలి. కోర్టు తీర్పు ఆయన భవిష్యత్ ప్రణాళికలకు మార్గం సుగమం చేయనుంది.


