
📌 Key Points
- నాగ చైతన్య, శోభిత ధూళిపాల వివాహం అనంతరం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
- ఓ ఈవెంట్‌లో నవీన్ పొలిశెట్టి ‘చై’ అని పిలవగా, శోభిత ‘చైతు’ అని సరిదిద్దింది.
- ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
- ఈ వీడియోపై నెటిజన్లు సమంత ప్రస్తావనతో సహా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
యువ సామ్రాట్ నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాల ఇటీవల ఒక ఈవెంట్‌లో నవీన్ పొలిశెట్టికి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగ చైతన్యను “చై” అని పిలిచినందుకు శోభిత, “చై కాదు చైతు” అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాగ చైతన్య-శోభిత ప్రేమ, వివాహ బంధం
యువ సామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya) సమంత(Samantha)తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాల(Dhulipala)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అంతేకాకుండా వేకేషన్స్‌కు వెళుతున్న ఫొటోస్‌ను షేర్ చేస్తూ అభిమానులకు కూడా దగ్గరవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే పెళ్లి తర్వాత నాగ చైతన్య ‘తండేల్’(Thandel) మూవీలో మనముందుకు వచ్చి మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈవెంట్‌లో నవీన్ పొలిశెట్టికి శోభిత ధూళిపాల కౌంటర్
ప్రజెంట్ ‘వృష కర్మ’(Vrushakarma) అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్‌లో చైతన్య శోభితలు పాల్గొన్నారు. అయితే అక్కడ నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) కూడా ఉన్నాడు. ఇక మైక్ పట్టుకొని నవీన్ పొలిశెట్టి చై చై ఇటు రా నువ్వే మెయిన్ అని అన్నాడు. అప్పుడు శోభిత చై కాదు చైతు అని కొంచెం సీరియస్‌గా అంటుంది.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో, నెటిజన్ల రియాక్షన్
అప్పుడు నవీన్ పొలిశెట్టి అతని పేరులోనే చేస్తాను అని ఉంది చేయను అని అనకూడదు అని అంటాడు. ఇంతటితో ఈవీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సమంత నాగ చైతన్యను చై అని పిలుస్తుంది కాబట్టి శోభితకు మండినట్టుంది అని, అన్నీ తెలిసే పెళ్లి చేసుకుంది కదా మళ్ళీ ఇదేంటి అని కొంతమంది అంటుంటే మరికొంతమంది శోభితకు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
శోభిత ధూళిపాల స్పందనపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సమంత ప్రస్తావనను తీసుకురాగా, మరికొందరు శోభితకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ చిన్న సంఘటన తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


