
📌 Key Points
- శోభిత ధూళిపాళ ‘చీకటిలో’ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 23న స్ట్రీమింగ్!
- ట్రైలర్‌తోనే దుమ్మురేపిన అక్కినేని కోడలు.. సినిమాపై భారీ అంచనాలు!
- సంక్రాంతి శుభాకాంక్షలతో శోభిత స్పెషల్ పోస్ట్.. అభిమానుల్లో క్యూరియాసిటీ
- రెడ్ శారీలో శోభిత ధూళిపాళ అదిరిపోయే లుక్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!
టాలీవుడ్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్! అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ తన నెక్స్ట్ మూవీతో సిద్ధంగా ఉంది. ఆమె లేటెస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసా?
అమెజాన్ ప్రైమ్‌లో ‘చీకటిలో’ మూవీ రిలీజ్!
స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(shobhitha Dulipala) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్య(Naga Chaitanya)తో పెళ్లి తర్వాత ఈ చిన్నది చేయబోతున్న ఫస్ట్ మూవీ ‘చీకటిలో’(Chikatilo). అయితే ఈ మూవీ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) ఓటీటీలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్(Trailer) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా శోభిత తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
వైరల్ అవుతున్న శోభిత ధూళిపాళ సంక్రాంతి పోస్ట్!
అందులో ‘సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ కోసం ఏదో వేచి ఉంది’ అనే క్యాప్షన్ జోడిస్తూ.. చీకటిలో అని రాసి ఉన్న కైట్‌ను ఎగరవేస్తుంది. ఇక ఆ పోస్ట్‌లో అక్కినేని కోడలు పెద్ద తిలకం బొట్టు పెట్టుకొని రెడ్ కలర్ శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకుని చాలా అందంగా కనిపించింది. అలాగే గజ్జెలు పట్టుకున్న, సన్నజాజి పూల దండలు పట్టుకున్న పిక్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అక్కినేని ఫ్యాన్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ రాబోతుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
రెడ్ శారీలో అక్కినేని కోడలు అదిరిపోయే లుక్స్!
A post shared by prime video IN (@primevideoin)
శోభిత ధూళిపాళ తన సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. అక్కినేని అభిమానుల్లో మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


